
శివకార్తికేయన్ ( Sivakarthikeyan ) కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పరాశక్తి' ( Paraasakthi ) . ఈ తమిళ పొలిటికల్ డ్రామా చిత్రంపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో మరింత ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే సెట్స్ ఉన్న ఈ మూవీలో రానా దగ్గుబాటి ( Rana Daggubati ) కూడా అఫీషియల్ గా షూటింగ్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పవర్ ఫుల్ కథ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రానా నటిస్తుండటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే రానా దగ్గుబాటి పాత్రపై మూవీ మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ రానా 'పరాశక్తి' షూటింగ్ లొకేషన్స్ కు రావడంతో అయన ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పవర్ ఫుల్, ఇంపాక్టివ్ క్యారెక్టర్స్ ఎంచుకోవడంలో ఆయన దిట్ట. మరి ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో అని అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
►ALSO READ | రానాకు రెండోసారి ఈడీ నోటీస్.. ఆగస్ట్ 11న విచారణకు రావాలని ఆదేశం
'పరాశక్తి'లో శివకార్తికేయన్ ను హీరో ఎంచుకోవడానికి గల కారణాలను దర్శకురాలు సుధా కొంగర ( Sudha Kongara ) వివరించారు. పక్కింటి కుర్రాడి లుక్స్, నిజాయితీ ఉండే పాత్రకు సరిపోయే సరైన నటుడు శివ అని చెప్పారు. ఈ సినిమా 1960వ దశకంలో సాగే తమిళ పొలిటికల్ డ్రామా పరాశక్తి. వాస్తవ సంఘటనలు, ముఖ్యంగా 1965లో తమిళనాట జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళనల స్పూర్తితో ఈ కథను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ నిరసనలు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక కీలక ఘట్టం. తమిళ అస్తిత్వాన్ని మార్చేసింది.
ఈ చిత్రంలో శివకార్తికేయన్ , శ్రీలీల, అధర్వ మురళి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రమి మోహన్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను 2026 పొంగల్ కు రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అధికారికంగా మూవీ మేకర్స్ ప్రకటించాల్సి ఉంది.