పేరుకే హైదరాబాద్.. లోకల్ ప్లేయర్ లేకుండానే బరిలోకి..

పేరుకే హైదరాబాద్.. లోకల్ ప్లేయర్ లేకుండానే బరిలోకి..

ఐపీఎల్‌‌‌‌ 2021 వేలంలో ఫారిన్‌‌ స్టార్లపై ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపించినా.. డొమెస్టిక్‌‌ టాలెంటెడ్‌‌ ప్లేయర్లకు ప్రయారిటీ ఇచ్చాయి. ఇప్పటికే ప్రూవ్‌‌ చేసుకున్న క్రికెటర్లతో పాటు ఫ్యూచర్‌‌ ఉంటుంది అనుకున్న ఆటగాళ్ల కోసం పోటీ పడ్డాయి. తమ స్టేట్స్‌‌కు చెందిన లోకల్‌‌ ప్లేయర్లను చాలా టీమ్స్‌‌ కొనుగోలు చేశాయి.  ఒక్క సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ తప్ప. ఆ  ఫ్రాంచైజీ మన స్టేట్‌‌ నుంచి ఒక్క  క్రికెటర్‌‌ను కూడా తీసుకోలేదు. తెలంగాణనే కాదు ఆంధ్ర ప్లేయర్లపై కూడా దయ చూపలేదు. లీగ్​లో ఫస్ట్‌‌ టైమ్‌‌ ఒక్క లోకల్‌‌ ప్లేయర్‌‌ కూడా లేకుండానే సన్‌‌రైజర్స్‌‌  ఓ సీజన్‌‌ ఆడబోతోంది.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఐపీఎల్​ ఆక్షన్​లో ఎప్పట్లానే డొమెస్టిక్​ ప్లేయర్లపై కూడా కాసుల వర్షం కురిసింది. కర్నాటక యంగ్‌‌‌‌స్టర్‌‌‌‌ కృష్ణప్ప గౌతమ్‌‌‌‌కు చెన్నై సూపర్‌‌‌‌ కింగ్స్‌‌‌‌ ఏకంగా 9.25 కోట్లు ముట్టజెప్పగా.. తమిళనాడుకు చెందిన షారూక్‌‌‌‌ ఖాన్‌‌‌‌ కోసం పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌‌‌ రూ. 5.25 కోట్లు ఖర్చు చేసింది. సౌరాష్ట్రకు చెందిన పేసర్‌‌‌‌ చేతన్‌‌‌‌ సకారియాకు రాజస్తాన్‌‌‌‌ 1.2 కోట్లు ఇచ్చింది. ఇంత పెద్ద మొత్తం కాకున్నా.. చాలా మంది లోకల్​ ప్లేయర్లను ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. కానీ,  మన లోకల్‌‌‌‌ ప్లేయర్లను పట్టించుకోని సన్​రైజర్స్‌‌‌‌ హైదరాబాద్​ టీమ్​పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆరెంజ్​ ఆర్మీ తీరును హెచ్‌‌‌‌సీఏ ప్రెసిడెంట్‌‌‌‌ అజరుద్దీన్‌‌‌‌ తప్పుబట్టాడు. హైదరాబాద్‌‌‌‌ నుంచి ఒక్కరికి కూడా చాన్స్‌‌‌‌ ఇవ్వకపోవడం నిరాశ కలిగించిందని అన్నాడు. భారీ వాగ్దానాలతో  ప్రెసిడెంట్‌‌‌‌ అయిన తర్వాత హెచ్‌‌‌‌సీఏ పాలనను గాలికొదిలేసి, అనేక విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అజర్‌‌‌‌ ఆక్షన్‌‌‌‌పై స్పందించడం కాస్త హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ హైదరాబాద్‌‌‌‌ ప్లేయర్లకు అన్యాయం జరిగిందనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఐపీఎల్‌‌‌‌ మొదలైనప్పటి నుంచి అన్ని ఫ్రాంచైజీలు తమ స్టేట్‌‌‌‌ క్రికెటర్లకు ప్రిఫరెన్స్‌‌‌‌ ఇస్తున్నాయి. గతంలో డెక్కన్‌‌‌‌ చార్జర్స్‌‌‌‌ సైతం ప్రతీ సీజన్‌‌‌‌లో కనీసం ముగ్గురు లోకల్‌‌‌‌ (హైదరాబాద్‌‌‌‌, ఆంధ్ర) ప్లేయర్లకు చాన్స్‌‌‌‌ ఇచ్చింది.

2013లో చార్జర్స్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో లీగ్‌‌‌‌లోకి వచ్చిన సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ కూడా 2015 వరకూ నలుగురు ప్లేయర్లను తీసుకుంది. తర్వాతి మూడు సీజన్లలో ముగ్గురికి చాన్స్‌‌‌‌ ఇచ్చింది. హైదరాబాద్‌‌‌‌ నుంచి అక్షత్‌‌‌‌ రెడ్డి, డీబీ రవితేజ, టి. సుమన్‌‌‌‌, హనుమ విహారి, ఆశీష్‌‌‌‌ రెడ్డి, సీవీ మిలింద్‌‌‌‌, తన్మయ్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌, మెహ్దీ హసన్‌‌‌‌లకు… ఆంధ్ర నుంచి వేణుగోపాల్‌‌‌‌ రావు, రిక్కీ భుయ్‌‌‌‌కు లీగ్‌‌‌‌లో ప్రాతినిధ్యం కల్పించింది. 2017 ఆక్షన్‌‌‌‌లో మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌ను ఏకంగా 2.6 కోట్లకు కొనుగోలు చేసి స్టార్‌‌‌‌ని చేసింది. కానీ, గత రెండు సీజన్ల నుంచి తెలుగు రాష్ట్రాల క్రికెటర్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. 2019లో రిక్కీ భుయ్‌‌‌‌ను మాత్రమే రిటైన్‌‌‌‌ చేసుకున్న సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ గతేడాది బావనక సందీప్‌‌‌‌ను కొనుక్కుంది. సీజన్‌‌‌‌ మధ్యలో ఏపీకి చెందిన పృథ్వీరాజ్‌‌‌‌ను తీసుకుంది. కానీ, యూఈఏలో జరిగిన లాస్ట్‌‌‌‌ ఎడిషన్‌‌‌‌లోఒక్క మ్యాచ్‌‌‌‌లో అయినా ఆడే అవకాశం ఇవ్వలేదు. ఈ సీజన్‌‌‌‌లో  ఇద్దరినీ రిలీజ్‌‌‌‌ చేసిన రైజర్స్‌‌‌‌ ఫ్రాంచైజీ ఆక్షన్‌‌‌‌లో తెలుగు రాష్ట్రాల నుంచి 14 మంది పోటీ పడినప్పటికీ  ఒక్కరిని కూడా తీసుకోకపోవడం శోచనీయం.  కానీ, మనోళ్ల టాలెంట్‌‌‌‌ను ఇతర ఫ్రాంచైజీలు గుర్తించాయి.  భగత్‌‌‌‌ వర్మ, హరి శంకర్‌‌‌‌ రెడ్డి (సీఎస్‌‌‌‌కే), యుధ్‌‌‌‌వీర్‌‌‌‌ సింగ్‌‌‌‌ (ముంబై), కేఎస్‌‌‌‌ భరత్‌‌‌‌ (ఆర్‌‌‌‌సీబీ)కు చాన్స్‌‌‌‌ ఇచ్చాయి.

పైసలున్నా.. దయ చూపలే

ఈ సీజన్‌‌‌‌  ఆక్షన్‌‌‌‌ కోసం సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ దగ్గర రూ. 10.75 కోట్లు అందుబాటులో ఉన్నాయి.  ఈ టీమ్‌‌‌‌కు మరో ముగ్గురు ప్లేయర్లు అవసరం. వార్నర్‌‌‌‌, విలియమ్సన్‌‌‌‌, బెయిర్‌‌‌‌స్టో, రషీద్‌‌‌‌ వంటి ఫారిన్‌‌‌‌ స్టార్లు.. భువనేశ్వర్‌‌‌‌, మనీశ్‌‌‌‌ పాండే వంటి ఇండియన్‌‌‌‌ ప్లేయర్లతో కోర్‌‌‌‌ టీమ్‌‌‌‌ చాలా స్ట్రాంగ్‌‌‌‌గా ఉంది. అయినప్పటికీ తెలుగోళ్లను రైజర్స్‌‌‌‌ అస్సలు పట్టించుకోలేదు. అలాగని మన దగ్గర టాలెంటెడ్‌‌‌‌ ప్లేయర్లు లేరని కాదు. టీమిండియా ఆటగాడు హనుమ విహారి, అండర్‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో ఆడిన బ్యాటింగ్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ తిలక్‌‌‌‌ వర్మతో పాటు  బావనక సందీప్‌‌‌‌, భగత్‌‌‌‌ వర్మ, యుధ్‌‌‌‌వీర్‌‌‌‌,  తనయ్‌‌‌‌ త్యాగరాజన్‌‌‌‌, అజయ్‌‌‌‌ దేవ్‌‌‌‌గౌడ్‌‌‌‌ వంటి క్రికెటర్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీళ్లను కాదన్న ఆరెంజ్​ ఆర్మీ  ఆక్షన్‌‌‌‌ ఫస్ట్ లాట్‌‌‌‌లో  ఎవ్వరూ పట్టించుకోని కేదార్‌‌‌‌ జాదవ్‌‌‌‌ను 2 కోట్లకు తీసుకుంది. ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌డ్‌‌‌‌ ప్లేయరే కావాలనుకుంటే జాదవ్‌‌‌‌కు బదులు విహారిని తీసుకోవచ్చు. టెస్టు ప్లేయర్‌‌‌‌గా ముద్రపడ్డప్పటికీ విహారి మంచి స్ట్రోక్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ అన్న సంగతి రైజర్స్‌‌‌‌ మెంటార్‌‌‌‌ వీవీఎస్‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌కు బాగా తెలుసు. పైగా, ఆఫ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌గానూ యూజ్‌‌‌‌ అవుతాడు. విహారికి కోటి రూపాయలు ఎక్కువ అనుకుంటే తిలక్‌‌‌‌ వర్మ ఉన్నాడు. తను ఏ ప్లేస్‌‌‌‌లో అయినా బ్యాటింగ్‌‌‌‌ చేయడంతో పాటు ఆఫ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌గా పనికొస్తాడు. కానీ, రైజర్స్‌‌‌‌ అతడినీ పట్టించుకోలేదు. ఇక, మిగిలున్న ఏకైక ఫారిన్‌‌‌‌ కోటాలో ముజీబ్‌‌‌‌ జద్రాన్‌‌‌‌ను ఎంచుకున్న హైదరాబాద్‌‌‌‌..  మూడో ప్లేయర్‌‌‌‌గా కర్నాటక లెఫ్టార్మ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ జగదీశ సుచిత్‌‌‌‌ను ( రూ. 30 లక్షలు) కొనుక్కుంది.  షాబాజ్‌‌‌‌ నదీమ్‌‌‌‌, అభిషేక్‌‌‌‌ శర్మ రూపంలో టీమ్‌‌‌‌లో ఆల్రెడీ ఇద్దరు  లెఫ్టార్మ్‌‌‌‌ స్పిన్నర్లున్నారు. ఇంకొకరు కావాలనుకుంటే హైదరాబాదీలు సందీప్‌‌‌‌, తనయ్‌‌‌‌ లో ఒకరిని తీసుకునే ఆప్షన్‌‌‌‌ ఉన్నా పొరుగు రాష్ట్రం ప్లేయర్‌‌‌‌ వైపే మొగ్గు చూపింది.

వాళ్లు అలా ..  మనోళ్లు ఇలా..

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌లో చాలా జట్లు లోకల్‌‌‌‌ ప్లేయర్లకు విరివిగా అవకాశాలు ఇస్తున్నాయి. మన సౌత్‌‌‌‌కే చెందిన సీఎస్‌‌‌‌కే టీమ్‌‌‌‌లో తమిళనాడుకు చెందిన సాయి కిశోర్‌‌‌‌, జగదీశన్‌‌‌‌, హరి నిశాంత్‌‌‌‌ ఉండగా.. ఆర్‌‌‌‌సీబీ కర్నాటక ప్లేయర్లు పడిక్కల్‌‌‌‌, పవన్‌‌‌‌ దేశ్‌‌‌‌పాండేకు మళ్లీ అవకాశం ఇచ్చింది. పంజాబ్‌‌‌‌ ఏకంగా నలుగురిని రిటైన్‌‌‌‌ చేసుకుంది. స్థానిక ఆటగాళ్లకు అవకాశం ఇస్తే వాళ్లు స్టార్లుగా మారుతారని చెప్పేందుకు లాస్ట్‌‌‌‌ సీజన్‌‌‌‌లో దుమ్మురేపిన పడిక్కల్‌‌‌‌ లేటెస్ట్‌‌‌‌ ఎగ్జాంపుల్‌‌‌‌. అతనే కాదు బుమ్రా, పాండ్యా బ్రదర్స్‌‌‌‌, పంత్‌‌‌‌, నటరాజన్‌‌‌‌ తదితరులు ఐపీఎల్‌‌‌‌ ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్లే. అయితే,  సన్‌‌‌‌ టీవీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌కు చెందిన సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ ఫ్రాంచైజీ ఐపీఎల్‌‌‌‌ టైమ్‌‌‌‌లో  ఉప్పల్​ స్టేడియాన్ని వాడుకోవడం తప్ప ఇక్కడి ప్లేయర్లను ఎంకరేజ్‌‌‌‌ చేసేందుకు ముందుకు రావడం లేదు. హైదరాబాదీ లక్ష్మణ్‌‌‌‌ మెంటార్‌‌‌‌గా ఉన్నప్పటికీ  మనోళ్లకు అవకాశం ఇవ్వడం లేదు. లీగ్‌‌‌‌లో ఆడించకపోయినా కనీసం టీమ్‌‌‌‌లోకి తీసుకుంటే ఫారిన్‌‌‌‌, ఇండియన్‌‌‌‌ ప్లేయర్ల నుంచి మన యంగ్‌‌‌‌స్టర్స్​ ఎంతో కొంత నేర్చుకునే వాళ్లు. కానీ, ఆ చాన్స్‌‌‌‌ కూడా రాకపోవడం మనోళ్ల బ్యాడ్‌‌‌‌లక్‌‌‌‌.