
ఐపీఎల్ 2025 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ శనివారం (ఏప్రిల్ 12) మరో కీలక మ్యాచ్ కు సిద్ధమవుతుంది. సాయంత్రం 7:30 నిమిషాలకు ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో తలపడబోతుంది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే సన్ రైజర్స్ కు ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ కీలకమే. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ జట్టు కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. దీంతో ఈ మ్యాచ్ లో విజయం హైదరాబాద్ జట్టుకు ఎంతో కీలకం. సొంతగడ్డపై తొలి మ్యాచ్ ల్పో గెలిచిన సన్ రైజర్స్ ఆ తర్వాత వరుసగా ఓడిపోతూ వచ్చింది. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి టోర్నీలో ముందుకు వెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ మధ్య జరిగిన హెడ్ టు హెడ్ రికార్డుల్లో SRH దే పైచేయి. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య మొత్తం 23 మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పంజాబ్ కింగ్స్ జట్టు 7 మ్యాచ్‌ల్లో గెలిచింది. సీజన్ తొలి మ్యాచులో గెలిచి అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసిన మన జట్టు ఆ తర్వాత వరుసగా 4 మ్యాచులు ఓడిపోయింది. మిగిలిన 9 మ్యాచుల్లో కనీసం 7 గెలిస్తేనే ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుంది. కాబట్టి ఇవాళ పంజాబ్ పై తప్పకుండా గెలవాల్సిందే.
Also Read : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
ఈ మ్యాచ్ లో ఓడిపోతే తర్వాతి 8 మ్యాచుల్లో 7 గెలవడం దాదాపుగా అసాధ్యం. హైదరాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ జరిగిన 80 ఐపీఎల్ మ్యాచ్‌లలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 35 సార్లు గెలిచింది. లక్ష్యాన్ని ఛేదించిన జట్టు 45 సార్లు గెలిచింది. ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో పోలీసులు పూర్తి భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో నిఘా ఉంచడంతో పాటు.. బ్లాక్ టికెట్స్ అమ్ముతున్న వారిపై SOT పోలీసుల నిఘా ఉంచారు. మ్యాచ్ కోసం వచ్చే వారికి ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులతో పాటు మెట్రో సమయం కూడా పొడిగించారు. ఇక స్టేడియంలోకి ఎలాంటి ఎలెక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు.
**Sunrisers Hyderabad vs Punjab Kings – Match 27**
— onecricketcom (@onecricketcom) April 12, 2025
📅 12th April 2025, Saturday
⏰ 7:30 PM IST
🏟️ Rajiv Gandhi International Stadium, Uppal, Hyderabad #IPL2025 #SRHvsPBKS #SunrisersHyderabad #PunjabKings #onecricket pic.twitter.com/L0qxeC736s