
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాత రోజుల్ని మరోసారి గుర్తు చేసింది. ఆదివారం (మే 25) కోల్‌కతా నైట్ రైడర్స్ పై సన్ రైజర్స్ బ్యాటింగ్ లో శివాలెత్తారు. కొడితే ఫోర్ లేకపోతే సిక్సర్ అన్నట్టుగా హైదరాబాద్ బ్యాటర్లు పూనకం వచ్చినట్టు ఆడారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగుతున్న ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగారు. క్లాసన్ కేవలం 37 బంతుల్లోనే సెంచరీ (39 బంతుల్లో 105: 7 ఫోర్లు, 9 సిక్సర్లు) చేయడంతో పాటు ట్రావిస్ హెడ్(40 బంతుల్లో 76: 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసంతో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ చేసింది.
టాస్ ఓడి తమ నిర్ణయం కరెక్ట్ అని సన్ రైజర్స్ నిరూపించారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడారు. తొలి ఓవర్లో 2 పరుగులే వచ్చినా రెండు, మూడు ఓవర్లలో ఏకంగా 39 పరుగులు రాబట్టింది. వీరి విజృంభణతో పవర్ ప్లే సన్ రైజర్స్ వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. 7 ఓవర్లో నరైన్ ఎట్టకేలకు నరైన్ ఈ జోడీని విడదీశాడు. భారీ షాట్ కు ప్రయత్నించి అభిషేక్ శర్మ 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ఈ దశలో హెడ్ కు జత కలిసిన క్లాసన్ నెక్స్ట్ లెవల్లో బ్యాటింగ్ చేశారు.
అరుణ్ జైట్లీ స్టేడియంలో ఏ కేకేఆర్ బౌలర్ ను వదలకుండా బౌండరీల వర్షం కురిపించారు. వీరి విధ్వంసం ధాటికి 8 ఓవర్లో 16.. 9 ఓవర్లో 10.. పదో ఓవర్లో 20 పరుగులు.. 11 ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లో మరోసారి నరైన్ హెడ్ వికెట్ తీసి బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. హెడ్ కేవలం 40 బంతుల్లోనే 76 పరుగులు చేయడం విశేషం. హెడ్ ఔటైనా క్లాసన్ చివరి వరకు క్రీజ్ లో ఉండి కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో 37 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకుని సన్ రైజర్స్ ను 270 పరుగుల మార్క్ దాటేలా చేశాడు. కోల్‌కతా బౌలర్లలో నరైన్ రెండు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా ఒక వికెట్ తీసుకున్నాడు.
The third-highest total in the IPL!
— ESPNcricinfo (@ESPNcricinfo) May 25, 2025
The top four records are now with SRH 🔥
🔗 https://t.co/1mwOcXSls1 | #IPL2025 pic.twitter.com/Nd71tYpRQk