సన్ రైజర్స్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ తొలగింపు

సన్ రైజర్స్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ తొలగింపు
  • కొత్త కెప్టెన్ గా విలియమ్సన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2021 సీజన్లో దారుణమైన పరాజయాలు చవి చూసిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ను తొలగించింది. ఈ సీజన్ లో మిగిలిన మ్యాచులన్నింటికీ కేన్ విలియమ్సన్ జట్టుకు నాయకత్వం వహిస్తాడని జట్టు యాజమాన్యం ట్విట్టర్ లో ప్రకటించింది. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ (34) 2016లో హైదరాబాద్ జట్టుకు 2016లో టైటిల్ అందించిన విషయం తెలిసిందే. మరుసటి సంవత్సరం అంటే 2015లోనూ.. ఆ తర్వాత 2017, 2019 సంవత్సరాల్లోనూ మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ దక్కేలా చేయడంలో డేవిడ్ వార్నర్ కీలకపాత్ర పోషించాడు. అయితే 2021లో ఎంతో ఆశతో టైటిల్ ఫెవరేట్ లా కనిపించిన హైదరాబాద్ జట్టు పేలవమైన ప్రదర్శనతో ఘోరమైన ఆటతీరుతో వరుస పరాజయాలు మూటకట్టుకుంది. ఇప్పటి వరకు వరుసగా ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదు మ్యాచులు ఓడిపోయింది. చెన్నైలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై మాత్రమే గెలిచింది. ఆడిన ప్రతి మ్యాచులోనూ జట్టు ఘోరమైన ఆటతీరును ప్రదర్శించడంతో జట్టు యాజమాన్యం మార్పులు చేర్పులతో కసరత్తు చేపట్టింది.