
- రాజస్థాన్ తో సన్ రైజర్స్ ఢీ నేడు
- గెలుపుబాట పట్టాలని హైదరాబాద్ ఆరాటం
- రాయల్స్ కు చావోరేవో
- విదేశీ ప్లేయర్లు అందుబాటులోలేక బలహీనపడ్డ ఇరుజట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తుది అంకానికి చేరుకుంది. ఓవర్ సీస్ ప్లేయర్లు మెల్లగా జట్లను వీడుతుండడంతో ఆయా టీమ్ ల అసలైన సామర్థ్యం బయటపడుతోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ తో శనివారం పోరుకు సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో నెగ్గి ప్లే ఆఫ్‌బెర్త్ వైపు ముందడుగు వేయాలని ఆరెంజ్ ఆర్మీభావిస్తోంది. మరోవైపు ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ప్రతీ మ్యాచ్ నాకౌట్ మ్యాచ్ లాగే భావిస్తూ రాయల్స్ బరిలోకి దిగుతోం ది.
బరిలోకి విలియమ్సన్
ఈ మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ జట్టు కూర్పులో మార్పులు జరిగే అవకాశముంది. గత మ్యాచ్ లోవ్యక్తి గత కారణాలతో దూరమైన కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్ కు అందుబాటులోకి రానున్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జానీ బెయిర్ స్టో ఈ మ్యాచ్ కు దూరం కానుండడంతో అతని స్థానంలో మార్టిన్ గప్టిల్ తుదిజట్టులో చోటు దక్కించుకోనున్నాడు. ఇప్పటి వరకు గెలిచిన మ్యాచ్ ల్లో వార్నర్ బెయిర్ స్టో ఓపెనర్ల ద్వయం భారీస్కో రు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెయిర్ స్టో స్థానంలో వచ్చే ప్లేయర్ అత్యున్నత ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది. గత మ్యాచ్ లో మనీశ్ పాండే ఫామ్ లోకి రావడం ఆరెంజ్ ఆర్మీకి సానుకూలాం శం. టాపార్డర్ లో డేవిడ్ వార్నర్ కు సహకారం అందించే బ్యాట్ స్ మన్ అవసరముంది. ఇక మిడిలార్డర్ లో యూసుఫ్ పఠాన్ , దీపక్‌హుడా, విజయ్ శంకర్ లు బ్యా ట్ ఝులిపించాల్సిన అవసరముంది. గత మ్యాచ్ లో ఆడిన బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ స్థానంలోమహ్మద్ నబీ జట్టు లోకి వచ్చే చాన్స్ ఉంది. ఇకబౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ , ఖలీల్ అహ్మద్ ,సందీప్ శర్మ సత్తాచాటుతున్నారు. స్పిన్నర్ రషీద్‌ఖాన్ ఆకట్టు కుంటున్నాడు. ఈ మ్యాచ్ లో గెలిస్తేసన్ రైజర్స్ ప్లే ఆఫ్ రేసుకు మరిం త చేరువవుంతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో విజయంసాధించి నాకౌట్ పోరుకు మరింత దగ్గరవ్వాలని టీమ్ మేనేజ్ మెం ట్ యెచిస్తోంది.
రాయల్స్ కు డూ ఆర్ డై
కోల్‌కతా నైట్ రైడర్స్ తో గత మ్యాచ్ లో అనూహ్య విజయం సాధించి రాజస్థాన్ రాయల్స్ తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటివరకు 11 మ్యాచ్ లాడిన రాయల్స్ నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు సాధించి పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ రేసులోఉండాలంటే మిగతా మూడు మ్యాచ్ ల్లో గెలవడంతో పాటు పలు సమీకరణాలు కూడా కలసిరావాలి. టాపార్డర్ లో అజింక్యా రహానే సూపర్ ఫామ్ లోఉండగా.. కెప్టెన్ స్టీవ్ స్మిత్ , సంజూశాంసన్ , రియాన్ పరాగ్ ఆకట్టు కుంటున్నారు.అయితే జోస్ బట్లర్ , స్టోక్స్ , జొఫ్రా ఆర్చర్ తదితరప్లేయర్లు దూరమవడంతో జట్టు బలహీనపడింది.ఈ క్రమంలో ఆ జట్టు ఎలా ఆడుతుందో చూడాలి. బౌలిం గ్‌లో వరుణ్ ఆరోన్ , శ్రేయస్ అయ్యర్ సత్తాచాటుతున్నారు. జైదేవ్ ఉనాద్కట్ స్థాయికి తగ్గట్లు ఆడాల్సిన అవసరముంది. ఆరెంజ్ ఆర్మీతో ఎదురైన ఓటమికి ఈ మ్యాచ్ లో బదులు తీర్చుకోవడంతో పాటు నాకౌట్ రేసులో ఉండాలని టీమ్‌మేనేజ్ మెంట్ కోరుకుంటోంది.
జట్లు (అంచనా)
సన్ రైజర్స్ హైదరాబాద్ : విలియమ్సన్ (కెప్టెన్ ),వార్నర్ , గప్టిల్, శంకర్ , మనీశ్ , హుడా,యూసుఫ్ , రషీద్ , షకీబ్ /నబీ, భువనేశ్వర్ ,సందీప్ , ఖలీల్.
రాజస్థాన్ రాయల్స్ : స్మిత్ (కెప్టెన్ ), రహానె,శాంసన్ , బిన్నీ, పరాగ్ , రాహుల్ త్రిపాఠి,గోపాల్, ఆరోన్ , ఉనాద్కట్ , ధవల్ కులకర్ణి.