ఐపీఎల్ లో బోణీ కొట్టని సన్ రైజర్స్.. ఖాతాలో మరో ఓటమి 

ఐపీఎల్ లో బోణీ కొట్టని సన్ రైజర్స్.. ఖాతాలో మరో ఓటమి 

హైదరాబాద్ కు వరుసగా రెండో ఓటమి

7 వికెట్లతో కోల్ కతా విక్టరీ

సత్తా చాటిన శుభమన్ గిల్..  మనీశ్ శ్రమ వృథా

భారీ సిక్సర్లు లేవు.. వరుస బౌండరీలు లేవు.. కళ్లు చెదిరే క్యాచ్‌‌లు లేవు… బౌలింగ్‌ మాయాజాలం లేదు..! అంతా చప్పగా సాగిపోయిన మ్యాచ్‌‌లో సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్‌‌ మళ్లీ బోల్తా కొట్టింది..! స్టార్లందరూ అందుబాటులో ఉన్నా.. సరైన టార్గెట్‌‌  నిర్దేశించలేక ఆరెంజ్‌ ఆర్మీ చేతులెత్తేసింది..! బ్యాటింగ్‌ లో మనీశ్ పాండే (38 బాల్స్‌ లో 51, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్‌‌ సెంచరీతో కాసేపు హల్‌‌చల్‌‌ చేసినా.. టీమ్ మేట్స్​ నుంచి సహకారం లేకపోయింది..! దీంతో రెండో ఓటమిని మూటగట్టుకుంది..! మరోవైపు అంతా ప్లాన్‌‌ ప్రకారం ఆడిన కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌ .. ఎట్టకేలకు బోణీ చేసింది..! యంగ్‌స్టర్‌‌ శుభ్‌మన్‌‌ గిల్‌‌ (62 బాల్స్‌ లో 70 నాటౌట్‌‌, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌ తో నైట్‌‌రైడర్స్‌ కు గెలుపు జీవం పోయగా.. మోర్గాన్‌‌ (29 బాల్స్‌ లో 42 నాటౌట్‌‌, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అండగా నిలిచాడు..!!

అబుదాబి:ఐపీఎల్‌ లో సన్‌ రైజర్స్‌ మినహా అన్ని జట్లూ బోణీ చేశాయి. వచ్చిన అవకాశా లను సద్వినియోగం చేసుకోలేకపోయిన వార్నర్‌ సేన బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌లో మరోసారి తడబడింది. దీంతో శనివారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌ లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించి తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 142 రన్స్‌ చేసింది. వార్నర్‌ (30 బాల్స్‌ లో 36, 2 ఫోర్లు, 1 సిక్స్‌ ), సాహా (31 బాల్స్‌ లో 30, 1 ఫోర్‌ , 1 సిక్స్‌ ) రాణించారు. తర్వాత కోల్‌కతా 18 ఓవర్లలో 3 వి కెట్లకు 145 రన్స్‌ చేసింది. గిల్‌ , మోర్గాన్‌ నాలుగో వికెట్‌ కు అజేయంగా 92 రన్స్‌ జోడించి నైట్‌ రైడర్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. గిల్​కు ‘మ్యాన్‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌ ’ అవార్డు లభించింది.

మనీశ్ హాఫ్‌‌ సెంచరీ

టాస్‌‌ గెలిచిన హైదరాబాద్‌ ను ఆశ్చర్యపరుస్తూ.. కేకేఆర్‌ తొలి ఓవర్‌ ను స్పిన్నర్‌ నరైన్‌ తో ప్రారంభించింది. రెండోఎండ్‌ నుంచి కమిన్స్‌ (1/19)ను దించడంతో ఓపెనర్లు వార్నర్‌, బెయిర్‌స్టో (5) తొలి రెండు ఓవర్లు ఆచితూచి ఆడారు. మూడో ఓవర్‌ లో నరైన్ బాల్‌ ను లాంగాన్‌ లో సిక్సర్‌ గా మల్చిన వార్నర్‌ .. మరో ఫోర్‌ తో 14 రన్స్‌ రాబట్టుకున్నాడు. కానీ బెయిర్‌స్టోకు ఆదృష్టం కలిసి రాలేదు. నాలుగో ఓవర్లో కమిన్స్‌ వేసిన ఆఫ్‌‌ కట్టర్‌ కు క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో సన్‌ రైజర్స్‌ 24 రన్స్‌ వద్ద ఫస్ట్‌ వికెట్‌ కోల్పోయింది. వన్‌ డౌన్‌ లో వచ్చిన మనీశ్​ పాండే… శివమ్‌‌ మావి బాల్‌ ను మిడ్‌ వికెట్‌ లో సిక్సర్‌ కొట్టి ఉద్దేశ్యాన్ని స్పష్టం చేశాడు.

పవర్‌ ప్లేలో హైదరాబాద్‌ 40/1 స్కోరు చేసింది. ఛేంజ్‌‌ బౌలర్‌ గా వచ్చిన కుల్దీప్‌ రన్స్‌ కట్టడి చేస్తే.. వరుణ్‌ (1/25) అదిరిపోయే షాకిచ్చాడు. 10వ ఓవర్‌ ఫస్ట్‌ బాల్‌ కు వార్నర్‌ కాటన్‌ బౌల్డ్‌‌ చేసి కేకేఆర్‌ శిబిరంలో ఆనందం నింపాడు. రెండో వికెట్‌ కు 35 రన్స్‌ భాగస్వామ్యం ముగియడంతో సాహా క్రీజులోకి వచ్చాడు. ఈ ఓవర్‌ లో 2 రన్స్‌ మాత్రమే రావడంతో ఫస్ట్‌ టెన్‌ లో హైదరాబాద్‌ 6.1 రన్‌ రేట్‌ తో 61/2 స్కోరు చేసింది. స్లో పిచ్‌ కావడంతో కోల్‌కతా స్పిన్నర్లు మిడిల్‌ ఓవర్స్‌ లో మరింత పట్టు సాధించారు. నరైన్‌ , నాగర్‌ కోటి, వరుణ్‌ పకడ్బందీ గా బౌలింగ్‌‌ చేయడంతో పాండే, సా హా భారీ షాట్లు కొట్టలేకపోయారు. ఐదు ఓవర్లలో కేవలం రెండు ఫోర్లు మాత్రమే వచ్చాయి. ఓవరాల్‌ గా 15 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్‌ 99/2 స్కోరు చేసింది. అనుకున్న స్కోరు రావడం లేదని గ్రహించిన సాహా.. 16వ ఓవర్‌ లో సిక్స్‌ తో బ్యాట్‌ ఝుళిపించాడు. తర్వాత కమిన్స్‌ 17వ ఓవర్‌ లో 8 రన్స్‌ తోనే సరిపెట్టాడు. 36 బాల్స్‌ లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసిన మనీశ్​ను.. 18వ ఓవర్‌ లో రసెల్‌ (1/16) సూపర్‌ గా కాటన్‌ బౌల్డ్‌‌ ఔట్‌ చేశాడు. ఫలితంగా మూడో వికెట్‌ కు 62 రన్స్‌ పార్ట్‌నర్‌షిప్‌ ముగిసింది. మహ్మద్‌ నబీ (11 నాటౌట్‌ ), సాహా వేగం పెంచే ప్రయత్నం చేసినా ఫలించలేదు. చివరి రెండు ఓవర్లలో 15 రన్స్‌ తో పాటు సాహా ఔట్‌ కా వడంతో హైదరాబాద్‌ ఓ మోస్తరు స్కోరుకేపరిమితమైంది.

గిల్‌‌.. జిగేల్‌‌

టార్గెట్‌ ఛేజింగ్‌‌లోనూ కోల్‌కతా.. హైదరాబాద్‌ ను ఫాలో అయ్యింది. రెండో ఓవర్‌ లోనే నరైన్‌ (0) వికెట్‌ కోల్పోయింది. అయితే శుభ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణా (26) నిలకడగా ఆడారు. సెకండ్‌ ఓవర్‌ లో గిల్‌ భారీ సిక్సర్‌ తో కుదురుకోగా.. రాణా వరుస విరామాల్లో ఐదు ఫోర్లు కొట్టాడు. ఐదో ఓవర్‌ లో మరో ఫోర్‌ కొట్టినా… ఆ వెంటనే వికెట్‌ ఇచ్చుకున్నాడు. పవర్‌ ప్లేలో 52/2 స్కోరు వచ్చింది. కానీ ఏడో ఓవర్‌ లో రషీద్‌ ఖాన్‌ (1/25) టర్నింగ్‌‌ బాల్‌ కు దినేశ్‌ కార్తీక్‌ (0) వికెట్ల ముందు దొరికాడు. తర్వాత గిల్‌ తో జతకలిసిన మోర్గాన్‌ నింపాదిగా ఆడాడు. పెద్ద టార్గెట్‌ కాకపోవడం, చేతిలో చాలినన్ని వికెట్లు ఉండటంతో కుదురుకోవడానికి టైమ్‌‌ తీసుకున్నాడు. ఈ క్రమంలో సింగిల్స్‌ , డబుల్సే వచ్చినా.. తొలి పది ఓవర్లలో నైట్‌ రైడర్స్‌ 72/3 స్కోరుతో నిలిచింది. మిడిల్‌ ఓవర్స్‌ ను రషీద్‌, నబీతో కంటిన్యూ చేయించిన వార్నర్‌ .. వీళ్లపై ఒత్తిడి తీసుకురాలేకపోయాడు. దీంతో తర్వాతి నాలుగు ఓవర్లలో 8, 9, 8, 5 రన్స్‌ వచ్చాయి. 15వ ఓవర్‌ ఆఖరి బాల్‌ ను మోర్గాన్‌ సిక్సర్‌ గా మల్చడంతో 11 రన్స్​ వచ్చాయి. ఓవరాల్‌ గా ఐదు ఓవర్లలో 41 రన్స్‌ రావడంతో నైట్‌ రైడర్స్‌ టార్గెట్‌ 30 బాల్స్‌ లో 30 రన్స్‌ గా మారింది. ఈ టైమ్‌‌లో మోర్గాన్‌, గిల్‌ .. వరుస షాట్లు బాది మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విజయానికి అవసరమైన రన్స్‌ సమకూర్చారు.

స్కోరు బోర్డు:

హైదరాబాద్: వార్నర్‌ (సి అండ్‌ బి) వరుణ్‌ 36, బెయిర్‌ స్టో (బి) కమిన్స్‌ 5, పాం డే (సి అండ్‌ బి) రసెల్‌ 51, సా హా (రనౌట్‌ ) 30,

నబీ (నాటౌట్‌ ) 11, అభిషేక్‌ (నాటౌట్‌ ) 2,

ఎక్స్‌ ట్రాలు: 7, మొత్తం : 20 ఓవర్లలో 142/4.

వికెట్ల పతనం: 1–24, 2–59, 3–121, 4–138.

బౌలింగ్‌: నరైన్‌ 4–0–31–0, కమిన్స్‌ 4–0–19–1, మావి 2–0–15–0, కుల్దీప్‌ 2–0–15–0, వరుణ్‌ 4–0–25–1, నాగర్‌ కోటి 2–0–17–0, రసెల్‌ 2–0–16–1.

కోల్‌‌కతా: గిల్‌ (నాటౌట్‌ ) 70, నరైన్‌ (సి) వార్నర్‌ (బి) అహ్మద్‌ 0, రాణా (సి) సాహా (బి) నటరాజన్‌ 26, కార్తీ క్‌ (ఎల్బీ) రషీద్‌ ఖాన్‌ 0, మోర్గాన్‌ (నాటౌట్‌ ) 42,

ఎక్స్‌ ట్రాలు: 7, మొత్తం : 18 ఓవర్లలో 145/3.

వికెట్ల పతనం: 1–6, 2–43, 3–53. బౌలిం గ్‌ : భువనేశ్వర్‌ 3–0–29–0, ఖలీల్‌ 3–0–28–1, నటరాజన్‌ 3–0–27–1, రషీద్‌ 4–0–25–1, నబీ 4–0–23–0, అభిషేక్‌ 1–0–11–0.