
ఆసిఫాబాద్ : వడదెబ్బతో ఇందిరా క్రాంతి ప్రాజెక్ట్ (IKP) ఉద్యోగి మృతి చెందిన సంఘటన కొమురం భీం జిల్లాలో శుక్రవారం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లా హస్పిటల్ ఆవరణలో సదరన్ క్యాంపు విధులు నిర్వహిస్తున్న ఐకెపి ఉద్యోగి అశోక్ (40) వడదెబ్బతో కుప్పకూలాడు. వెంటనే అతడిని అదే హస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేస్తుండగానే అశోక్ చనిపోయాడని తెలిపారు డాక్టర్లు. మృతుని కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని హస్పిటల్ ముందు ఐకేపీ ఉద్యోగులు ధర్నా చేశారు. పరామర్శించడానికికి వచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్ ను అడ్డుకున్నారు ఐకేపీ ఉద్యోగులు.