పెండింగ్‌‌ చలాన్లకు సూపర్ రెస్పాన్స్..ప్రభుత్వానికి రూ. 66 కోట్ల ఆదాయం

 పెండింగ్‌‌ చలాన్లకు సూపర్ రెస్పాన్స్..ప్రభుత్వానికి రూ. 66 కోట్ల ఆదాయం

ట్రాఫిక్ పెండింగ్‌‌ చలాన్లకు వాహనదారుల నుంచి భారీగా స్పందన వస్తుంది. . ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలానాలు ఉండగా గతేడాది డిసెంబర్ 25 వరకు ఉన్న వాటిపై భారీగా రాయితీ ప్రకటించింది.  బైక్​లు, ఆటోలపై ఉన్న పెండింగ్ చలాన్లకు 80 శాతం,  ఆర్టీసీ బస్సులకు 90 శాతం, కార్లు,హెవీ మోటార్‌‌‌‌ వెహికల్స్‌‌కు 60 శాతం రాయితీ ప్రకటించింది. 

దీంతో వాహనదారుల నుంచి  విశేషమైన స్పందన వస్తోంది.   2023 డిసెంబర్ 26 నుంచి 11 రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 76.79 లక్షల చలానాలకు సంబంధించి రూ.66.77 కోట్ల చెల్లింపులు జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. 

ఈ అవకాశం మరో ఐదు రోజులు అంటే జనవరి 10 వ తేదీ వరకు ఉన్నట్లుగా ట్రాఫిక్‌ అదనపు సీపీ ఎం.విశ్వప్రసాద్‌ తెలిపారు. దీనిని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్‌, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారానూ చెల్లింపులు స్వీకరిస్తున్నట్లు వివరించారు.