సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు పూర్తి

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు పూర్తి

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.  మూడురౌండ్లు గాల్లో కాల్పులు జరిపి  పోలీసులు గౌరవవందనం సమర్పించారు. ఘట్టమనేని కుటుంబ సభ్యుల అశ్రు నివాళుల మధ్య కృష్ణ అంత్యక్రియలు  పూర్తయ్యాయి. 

అంతకు ముందు నానక్ రామ్ గూడలోని పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు కృష్ణ  అంతిమయాత్రను  నిర్వహించారు. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. తెలంగాణతో పాటు.. ఏపీ జిల్లాల నుంచి ఫ్యాన్స్ భారీగా వచ్చారు. దీంతో నానక్ రామ్ గూడ, ఫిల్మ్ నగర్ ఏరియాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.