
సూపర్‌స్టార్ రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన హైబీపీతో జూబ్లిహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేరారు. పది రోజుల కిందట అన్నాత్తే సినిమా షూటింగ్ కోసం రజినీ హైదరాబాద్‌కు వచ్చారు. ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న చిత్ర యూనిట్ కొంతమందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా.. ముందు జాగ్రత్తగా డిసెంబర్ 22న రజినీకాంత్‌కు కరోనా పరీక్ష చేయగా నెగటివ్ వచ్చింది. అయినప్పటికీ ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అయితే కరోనా లక్షణాలు లేకున్నా కూడా హైబీపీ ఉండటంతో ఆయన అపోలో హాస్పిటల్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
For More News..
మంత్రి శంకర్‌పై 250 కేసులు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు..
ప్రధాని హోదాలో విదేశాలలో హిందీ మాట్లాడిన మొదటి వ్యక్తి వాజ్‌పేయి
మాజీ ప్రధాని వాజ్‌పేయికి నివాళులర్పించిన ప్రముఖులు