ఏసీబీ వలలో నల్గొండ జీజీహెచ్ సూపరింటెండెంట్

ఏసీబీ వలలో నల్గొండ జీజీహెచ్ సూపరింటెండెంట్
  •      రూ.3 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన లచ్చూనాయక్​

నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండలోని ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చూనాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఉమ్మడి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఎం.వీ. శ్రీనివాసరావు కథనం ప్రకారం.. రాపోలు వెంకన్న నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు సర్జికల్ డ్రగ్స్​తో పాటు కొన్ని టెండర్​లో లేని డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు.  45  రోజుల కింద సూపరింటెండెంట్ లచ్చు నాయక్ ​డ్రగ్స్​ సరఫరా చేయాలంటే తనకు లక్ష ఇవ్వాలని డిమాండ్​ చేసి తీసుకున్నాడు. 15 రోజుల కింద మరో లక్ష తీసుకున్నాడు.  మళ్లీ  మరో రూ.3 లక్షలు అడగడంతో వెంకన్న ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం ప్రకాశం బజార్​లోని లచ్చూనాయక్​అద్దె ఇంట్లో రూ.3 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు, ఇన్​స్పెక్టర్లు రం గారావు, వెంకట్ రావు, రామారావు, సిబ్బంది శ్రీధర్, సంపత్, సుధాకర్  పాల్గొన్నారు.