ఇంకా విషమంగానే కృష్ణ ఆరోగ్యం

ఇంకా విషమంగానే కృష్ణ ఆరోగ్యం

గుండెపోటుతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని..మరో 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమన్నారు. కార్డియాక్ అరెస్ట్ వల్ల కిడ్నీ, లంగ్స్, బ్రెయిన్ వంటి ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యాయని చెప్పారు. అయితే ప్రస్తుతం డయాలసిస్ చేస్తున్నామన్నారు. కృష్ణను 8 మంది డాక్టర్ల బృందం పర్యవేక్షిస్తుందని తెలిపారు. చాలా ఏళ్ల నుంచి కృష్ణ తమ ఆసుపత్రిలోనే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం మరోసారి కృష్ణ హెల్త్ బులిటెన్ ను విడుదల చేస్తామన్నారు. 

కృష్ణ పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తారని ఆశిస్తున్నట్లు నటుడు నరేష్ అకాంక్షించారు. కృష్ణ మంచి ఫైటర్ అని..కోలుకుంటారని చెప్పారు. ఆదివారం కృష్ణ అస్వస్థతకు గురైతే ఆసుపత్రికి తీసుకొచ్చామని..ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందన్నారు. అయితే క్రిటికల్ గానే ఉన్నా...శ్వాస తీసుకుంటున్నారని తెలిపారు. 48 గంటల తర్వాతే ఏదైనా చెప్పగలమన్నారు. కృష్ణ ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులంతా దేవుడిని ప్రార్థించాలని నరేశ్ కోరారు.