షారుఖ్ వన్ మ్యాన్ షో.. జవాన్పై బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చిన మహేష్

షారుఖ్ వన్ మ్యాన్ షో.. జవాన్పై బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చిన మహేష్

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah rukh khan) నటించిన లేటెస్ట్ మూవీ జవాన్(Jawan) సక్సెస్ పై స్పందించారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu). విడుదల రోజే జవాన్ సినిమాను తన ఫ్యామిలీతో చూశారు మహేష్. అనంతరం ట్విట్టర్ వేదికగా ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈమేరకు జవాన్ సినిమాపై బ్లాక్ బస్టర్ రివ్యూ ఇస్తూ ట్విట్టర్ లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. 

ALSO READ : యూరియా కోసం రైతుల పడిగాపులు.. పట్టించుకోని అధికారులు

 జవాన్ సినిమా బ్లాక్ బస్టర్. కింగ్ తో కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇచ్చాడు అట్లీ. ఇది షారుఖ్ ఖాన్ కెరీర్ బెస్ట్ ఫిలిం. షారుఖ్ ఆరా, స్క్రీన్ ప్రెజెన్స్, చరిష్మాను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. షారుఖ్ ఫైర్ మీదున్నారు. జవాన్ షారుఖ్ సొంత సినిమా రికార్డులనే బద్దలు కొడుతుంది. లెజెండ్ అని రాసుకొచ్చారు మహేష్. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియా లో తెగ వైరల్ ఆవుతోంది. ఇది చూసిన షారుఖ్ ఫ్యాన్స్ మహేష్ పై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక జవాన్ సినిమా విషయానికి వస్తే.. సెప్టెంబర్ 7న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి అదిరిపోయే టాక్ వచ్చింది. అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ముందునుండే భారీ అంచనాలు ఏర్పడగా.. వాటిని అధిగమించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది జవాన్. దీంతో మొదటిరోజు ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.