
సూపర్ స్టార్ మహేష్ బాబు తెరపైనే కాదు నిజజీవితంలో కూడా సూపర్ స్టార్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. అనారోగ్య సమస్యలతో మంచానపడ్డ తన అభిమాని కుటుంబానికి అండగా నిలిచాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామానికి చెందిన కాకర్లమూడి రాజేశ్ మహేష్ బాబుకు చాలా పెద్ద అభిమాని. ఆయనకు భార్య సుజాత.. ముగ్గురు కుమారులు ఉన్నారు. మహేష్ మీద అభిమానంతో పిల్లలకు అర్జున్, అతిథి, ఆగడు అని సినిమా పేర్లు పెట్టుకున్నాడు.
అయితే.. కొంతకాలంగా రాజేశ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన చనిపోయేలోగ మహేష్ ను కలవాలనేది ఆయన కోరిక. ఆ విషయం తెలుసుకున్న మహేష్ బాబు తన టీమ్ ను రాజేష్ ఇంటికి పంపించి వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచాడు. రాజేష్ కుమారులు అతిధి, అర్జున్, ఆగడు లను మంచి స్కూల్ లో చేర్పించాడు. ఇక నుండి వారి బాగోగులు కూడా తానే చూసుకుంటానని మాట కూడా ఇచ్చాడట మహేష్. ఈ విషయం తెల్సుకున్న మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రియల్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో తరువాతి సినిమా చేస్తున్నాడు. పాన్ వరల్డ్ రేంజ్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.