రెండు కొత్త సినిమాలకు రజినికాంత్ సైన్

రెండు కొత్త సినిమాలకు రజినికాంత్ సైన్

సూపర్ స్టార్ రజినీకాంత్ సూపర్ స్పీడుతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌‌‌‌ కుమార్ డైరెక్షన్‌‌‌‌లో ‘జైలర్‌‌‌‌‌‌‌‌’ అనే చిత్రంలో నటిస్తోన్న ఆయన, ఇటీవల మరో రెండు కొత్త సినిమాలకు సైన్ చేశారు. వరుస ప్రెస్టీజియస్‌‌‌‌ సినిమాలను నిర్మిస్తోన్న  లైకా ప్రొడక్షన్స్‌‌‌‌ నిర్మించ నుంది. వీటిలో ఓ సినిమాను రజినీకాంత్ కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేస్తోంది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ‘లాల్‌‌‌‌ సలామ్’ పేరుతో రూపొందు తోన్న ఈ మూవీ ఓపెనింగ్ నిన్న చెన్నైలో గ్రాండ్‌‌‌‌గా జరిగింది. రజినీకాంత్, నిర్మాత సుభాస్కరన్‌‌‌‌తో పాటు టీమ్ అంతా పాల్గొన్నారు.

పదేళ్లక్రితం ధనుష్‌‌‌‌ ‘3’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన ఐశ్వర్య, ఆ తర్వాత వాయ్ రాజా వాయ్, సినిమా వీరన్ చిత్రాలు చేసింది. ఇటీవల ధనుష్‌‌‌‌తో విడాకులు తీసుకున్న ఆమె, వరుస ప్రాజెక్ట్స్‌‌‌‌తో బిజీ అయింది. ప్రస్తుతం ‘ఓ సాతి చల్‌‌‌‌’ అనే హిందీ సినిమా చేస్తోంది. అదింకా పూర్తవకముందే ఈ కొత్త చిత్రం మొదలైంది. చిన్న కూతురు సౌందర్య దర్శకత్వంలో ఎనిమిదేళ్ల క్రితం ‘కొచ్చాడయాన్‌‌‌‌’లో నటించిన రజినీకాంత్ ఇప్పుడు పెద్ద కూతురు ఐశ్వర్య డైరెక్షన్‌‌‌‌లో నటించబోతున్నారు. అయితే ఇందులో ఆయన ఫుల్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌ హీరోగా నటించడం లేదు. కీలక పాత్రలో స్పెషల్ అప్పియరెన్స్‌‌‌‌ ఇవ్వనున్నారు. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ హీరోలుగా నటిస్తున్నారు. క్రికెట్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఈ  సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఇటీవల రజినీకాంత్ ప్రకటించిన చిత్రాల్లో ఒకటి కూతురి డైరెక్షన్‌‌‌‌లో తెరకెక్కుతుండగా, మరో సినిమాను ఎవరు డైరెక్ట్ చేయనున్నారు అనేది తెలియాల్సి ఉంది.