జీహెచ్ఎంసీ కార్మికురాలిని లైంగికంగా వేధించిన సూపర్ వైజర్ సస్పెండ్

జీహెచ్ఎంసీ కార్మికురాలిని లైంగికంగా వేధించిన సూపర్ వైజర్ సస్పెండ్

హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో పారిశుధ్య కార్మికురాలిని లైంగికంగా వేధించిన సూపర్ వైజర్ కిషన్ ను సస్పెండ్ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్..

 జీడిమెట్ల పరిధిలో పారిశుధ్య కారిల్మికురాలుని లైంగికంగా వేధిస్తున్న వీడియోలు ఇవాళ ఉదయం  వైరల్ అయ్యాయి. గాజులరామారం సర్కిల్ సూరారంలో ఎస్ ఎఫ్ఏగా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే వ్యక్తి తనకింద పనిచేస్తున్న ఓ మహిళ కార్మికురాలిని గత కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు.  తాను చెప్పినట్లు వినకుంటే విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టాడు. 

అధికారి వేధింపులకు తాళలేక ఎవరికి చెప్పలేక నరక యాతన అనుభవిస్తున్న కార్మికురాలు అతని చెరలో పడక తప్పలేదు. అంతటితో ఆగకుండా ఈ తతంగం మొత్తాన్ని తన ఫోన్ లో వీడియోలు తీశాడు.వీడియోలు వైరల్ కావడంతో   సూపర్ వైజర్ కిషన్ ను  సస్పెండ్ చేసి ఎంక్వైరీ చెయ్యాలని ఆదేశించిన కమిషనర్ రోనాల్డ్ రాస్.