కేటీఆర్ కుల అహంకారిగా మాట్లాడుతున్నారు

కేటీఆర్ కుల అహంకారిగా మాట్లాడుతున్నారు

నిజామాబాద్: ఫసల్ భీమా యోజన పథకం రాష్ట ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. గత సంవత్సరం అధిక వర్షాలతో పసుపు పంట దెబ్బతీన్నదని..కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు విషయంలో కేసీఆర్ సర్కార్ కావాలనే జాప్యం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల భీమా ప్రీమియం చెల్లించక 46 వేల రైతులకు అన్యాయం చేస్తుందని చెప్పారు. జిల్లాలో మంత్రిగా ప్రశాంత్ రెడ్డి చేసిందేమీ లేదని.. బాల్కొండ నియోజక వర్గంలో నిర్మిస్తున్న చెక్ డ్యాంలు అన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టినవే అన్నారు. చెక్ డ్యాంల నిధులు రాష్ట్రం ఇస్తుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న అర్వింద్.. ఆజాధికా అమృత్ మహోత్సవ్ లో జిల్లాలో 75 చెరువులు, కుంటల మరమ్మతులకు ఒక్కో పాండ్ కి 7 లక్షలు కేంద్రం ఇచ్చిందన్నారు.

కేంద్రం ఇచ్చే సర్వ శిక్ష అభియాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్ళిస్తుందని.. కేంద్రం నుంచి వచ్చే లక్షల కోట్లు జిల్లాలకు చేరటం లేదన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిని టీఆరెస్ ఎమ్మెల్యేలు నాశనం చేస్తున్నారని.. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ విచ్చల విడిగా సప్లై అవుతున్నాయని చెప్పారు. జిల్లాలో ఉగ్రవాద మూఖలు తమ స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయని.. మత కలహాలు సృష్హించేందుకు ఎంఐఎంతో కలిని ఉగ్రవాద సంస్థలు పని చేస్తున్నాయని తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కనుసన్నల్లోనే ఉగ్రవాద చర్యలు పని చేస్తున్నాయని.. పోలీస్ కమిషనర్ నాగరాజుని నిజామాబాద్ నుండి బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పేట్టేందుకే సీపీగా నాగరాజుని పంపించారని చెప్పారు. కేటీఆర్ కుల అహంకారిగా మాట్లాడుతున్నాడరని.. మొన్నటి మోడీ సభ లాంటి పెద్ద సభను నేను నా జీవితంలో చూడలేదని ఎంపీ అర్వింద్ తెలిపారు.