వర్షాలతో పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలి

వర్షాలతో పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలి

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు బాగా దెబ్బతింటున్నాయన్నారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వర్షాలతో వరి, మొక్కజొన్న, పత్తి తదతర పంటలు పాడయ్యాయన్నారు. దీంతో రైతులు  తీవ్రంగా నష్టపోతున్నారని ..  తెలంగాణ వచ్చాక ఒక్కసారి కూడా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకున్న పాపాన పోలేదన్నారు. మొక్కజొన్న పంటలు కొనమని ప్రభుత్వం చెవుతుందని.. మొక్కజొన్న రైతులు నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇచ్చి మొక్కజొన్నలు కొనాల్సిందేనని.. రైతులను ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం చెప్పినట్టు వరి రైతులు సన్న రకం వరి పంటలు వేశారని..పెట్టుబడికి దిగుబడికి వచ్చే ధరకు పొంతనలేదన్నారు.

మద్దతు ధర 1888 రూపాయలు ఉందని.. అది వరికి సరిపోదన్నారు. రాష్ట్రంలో మరో 600 రూపాయల బోనస్ ఇచ్చి వరి రైతులను ఆదుకోవాలన్నారు ఉత్తమ్.  ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోతున్న పంటలకు కేంద్ర ఇచ్చిన జి.ఓ 1 ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. వరి పంటకు ఎకరాకు 20 వేలు, పత్తికి ఎకరాకు 30 వేలు పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందన్నారు ఉత్తమ్.