బీజేపీని ఓడించడానికే టీఆర్ఎస్ కు మద్దతు: తమ్మినేని వీరభద్రం

బీజేపీని ఓడించడానికే టీఆర్ఎస్ కు మద్దతు: తమ్మినేని వీరభద్రం

చౌటుప్పల్, వెలుగు: టీఆర్ఎస్​ పాలనలో కొన్ని ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదని, అంతమాత్రాన ఆ పార్టీని బలహీనపరచవద్దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటం చేద్దామని, కానీ బీజేపీని మునుగోడులో అడుగు పెట్టనీయవద్దన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్​ జరిగిన సీపీఎం మునుగోడు నియోజవర్గ కార్యకర్తల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు.

బీజేపీని ఓడించడానికే టీఆర్ఎస్​ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డికి మద్దతిచ్చామని చెప్పారు. అయినప్పటికీ టీఆర్ఎస్​ ప్రభుత్వ వైఫల్యాలపై కమ్యూనిస్టులుగా తాము నిత్యం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. కమ్యూనిస్టుల మీద ఇష్టమొచ్చినట్టు మాట్లాడకుండా నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డిని హెచ్చరించారు.