CBSE పరీక్షలపై సుప్రీం విచారణ జూన్ 3కు వాయిదా

CBSE పరీక్షలపై సుప్రీం విచారణ జూన్ 3కు వాయిదా

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ, సీఐసీఎస్సీ  12వ తరగతి పరీక్షల రద్దుపై విచారణను సుప్రీంకోర్టు జూన్ 3వ తేదీ అంటే గురువారానికి వాయిదా వేసింది. పరీక్షలు నిర్వహించాలా ? వద్దా ? అనే అంశంపై మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టులో స్పష్టం చేసింది. పరీక్షలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. పరీక్షలు నిర్వహించాలా ? వద్దా ? అనే అంశంపై కేంద్రం రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోబోతున్నట్లు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీం కోర్టుకు తెలియజేశారు. అన్ని అంశాలను నిపుణుల పరిశీలిస్తున్నారని, కాబట్టి మరో 3 రోజులు సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. పరీక్షలపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే గత ఏడాది నిర్ణయాన్ని పక్కన పెట్ాలని అనుకుంటే దానికి తగిన కారణాలు కూడా చెప్పాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. 
పరీక్షల రద్దుపై దాఖలైన రెండో పిటిషన్ పై విచారణ సందర్భంగా అన్ని నిర్ణయాలను కోర్టు ముందుంచుతారని ఆశిస్తున్నామని జస్టిస్‌ ఎఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అడ్వకేట్‌ మమతా శర్మ కూడా పరీక్షలు రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. రెండు రోజుల్లో దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందన్న అటార్నీ జనరల్‌ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు మన్నించింది. పిటిషనర్‌ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా ఒక వేళ గత ఏడాది విధానాన్నే అమలు చేసినట్లయితే దానికి సరైన కారణాలు తెలపాలని  కేంద్రాన్ని ఆదేశిస్తూ విచారణను జూన్‌ 3కు వాయిదా వేసింది.