హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ జరిగే అవకాశం లేదని సుప్రీంకోర్టు అడ్వకేట్ నితిన్ మేశ్రాం అభిప్రాయపడ్డారు. వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమని, ఒకవేళ వర్గీకరణ చేయాల్సి వస్తే ఆర్టికల్ 335 ని సవరించాల్సిందేనని తెలిపారు. శనివారం సైఫాబాద్ లోని శాంతి చక్ర ఇంటర్నేషనల్ కార్యాలయంలో మాల వెల్ఫేర్అసోషియేషన్, మాల మహాసభ ఆధ్వర్యంలో ‘ఎస్సీ వర్గీకరణ – సుప్రీం కోర్టులో ఏం జరిగింది’ అనే అంశంపై చర్చ జరిగింది.
బత్తుల రాం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నితిన్ మేశ్రాం పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరా సహాని వర్సెస్యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్తో ఎస్సీ వర్గీకరణకు సంబంధం లేదన్నారు. అర్టికల్16(IV) వెనుకబడిన కూలాలకు మాత్రమే సంబంధించినదని వెల్లడించారు.
