సెంట్రల్‌ విస్టా నిర్మాణ పనులు నిలిపేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్

సెంట్రల్‌ విస్టా నిర్మాణ పనులు నిలిపేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి స్పీడ్ గా పెరుగుతున్న క్రమంలో కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై స్పందించిన సుప్రీం దాఖలైన పిటిషన్ల విచారణ తేదీని నిర్ణయిస్తామని బుధవారం తెలిపింది. కరోనా సమయంలో.. దేశంలో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో వేలాది మంది ప్రజలు చనిపోతున్నారు. ఇలాంటి సమయంలో కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులు కేంద్ర ప్రభుత్వం చేపట్టడంపై ప్రతిపక్షాలు, సామాజిక కార్యాకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టును 20 వేల కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వం.. ఈ నిర్మాణ పనులను 'అవసరమైన సేవల' పరిధిలోకి తేవడంపై ప్రతిపక్షాలను ఆగ్రహానికి గురిచేస్తోంది. దీనిపై దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 17కు వాయిదా వేయడంతో...తాజా పిటిషన్‌ను స్వీకరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ..పిటిషనర్ల తరుపు న్యాయవాది సిద్ధార్థ్‌ లుథ్రా అభ్యర్థించారు. అయితే ప్రస్తుతానికి న్యాయమూర్తులు అందుబాటులో లేని కారణంగా... బెంచ్‌ ఏర్పడ్డాక విచారిస్తామని చెప్పారు.