సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీచేసే రిట్లు

సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీచేసే రిట్లు

రిట్ అంటే 'ఆజ్ఞ' అని అర్థం. సుప్రీంకోర్టు, హైకోర్టు హక్కులను కాపాడడానికి కొన్ని రిట్లు జారీ చేస్తుంది. 

హెబియస్ కార్పస్ : ఈ రిట్ ప్రకారం నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచాలి.  
మాండమస్ : 'మేము ఆజ్ఞాపిస్తున్నాం' అని దీని అర్థం. ఏ అధికారి అయినా ప్రజాసంబంధ, చట్టబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించడానికి నిరాకరించినప్పుడు వాటిని నిర్వర్తించమని కోర్టులు జారీ చేసే రిట్.    

సుప్రీంకోర్టు

ప్రొహిబిషన్ : దిగువ కోర్టు తన అధికార పరిధిలో లేని విషయాన్ని గురించి విచారిస్తున్నప్పుడు దాన్ని నిలిపివేయమని ఈ రిట్‌‌ను జారీ చేస్తారు.
సెర్షియోరరి : కింది కోర్టులు లేదా ట్రైబ్యునళ్లు తమ అధికార పరిధిలో ఉండేలా చూడటం ఈ రిట్ ఉద్దేశం. కింది కోర్టులు లేదా ట్రైబ్యునళ్లు వెలువరించిన ఉత్తర్వులను రద్దు చేయడానికి ఈ రిట్‌‌ను జారీ చేస్తారు.
కోవారంటో : 'ఏ అధికారంతో' అని దీని అర్థం. ఏ అధికారంతో పదవిలో కొనసాగుతున్నారో ఆధారాలు చూపమని కోర్టులు జారీ చేసే రిట్.