వీవీప్యాట్ల క్రాస్ వెరిఫికేషన్ .. ఎన్నికల్లో ఎలాంటి అనుమానాలు ఉండొద్దు: సుప్రీంకోర్టు

వీవీప్యాట్ల క్రాస్ వెరిఫికేషన్ .. ఎన్నికల్లో ఎలాంటి అనుమానాలు ఉండొద్దు: సుప్రీంకోర్టు

కేరళలోని కాసర్ గోడ్ లోక్ సభ నియోజకవర్గంలో బుధవారం మాక్ పోలింగ్ నిర్వహించారు. నాలుగు ఈవీఎంల్లో వేసిన ఓట్ల కంటే వీవీప్యాట్లలో పోలైన సంఖ్య ఎక్కువగా చూపిస్తోంది. దీనిపై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీ కోర్టును ఆశ్రయించారు. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT) మెషీన్‌లతో పోలైన ఓట్లను EVMలో వేసిన వేసిన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేసేటట్లు ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరారు. స్వేచ్ఛగా, న్యాయ‌బ‌ద్ధంగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌డానికి తీసుకున్న చర్యలను వివ‌రించాల‌ని సుప్రీంకోర్టు గురువారం ఎన్నిక‌ల సంఘాన్ని కోరింది. 

వీవీప్యాట్ల పనితీరును ఎన్నికల కమీషన్ అధికారి కోర్టుకు వివరించారు. ప్రస్తుతం 17 లక్షల వీవీప్యాట్లు ఉన్నట్లు కోర్టుకు ఈసీ తరుపున న్యాయవాది తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాపాడుకోవాలని, ఏవైనా సందేహాలు లేదా భయాందోళనలను తొలగించడానికి అన్ని విధానాలను ఖచ్చితంగా పాటించేలా చూడటం ఈసీ భాద్యతని సుప్రీం కోర్టు చెప్పుకోచ్చింది.  ఎన్నిక‌ల ప్రక్రియలో ఎటువంటి అనుమానాలు ఉండ‌వ‌ద్దు అని జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, జ‌స్టిస్ దీపాంక‌ర్ దత్ లతో కూడిన ధ‌ర్మాస‌నం తేల్చి చెప్పింది.