మతం పేరుతో మనం ఎటుపోతున్నాం?: సుప్రీం కోర్టు

మతం పేరుతో మనం ఎటుపోతున్నాం?: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: ‘‘ఇది 21వ శతాబ్దం. ఇప్పుడు కూడా మనం మతం పేరుతో ఎటుపోతున్నాం?”అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలో విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేషపూరిత నేరాలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తంచేసింది. విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేషపూరిత నేరాలపై అధికారులు తమకు తాముగా తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే కోర్టు ధిక్కరణ అభియోగాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులు లౌకిక దేశమైన ఇండియాను షాక్​కు గురిచేస్తున్నాయని పేర్కొంది. దేశంలో ముస్లింలను టార్గెట్​గా చేసి జరుగుతున్న దాడులు, వారిని ఉద్దేశించి చేస్తున్న విద్వేషపూరిత ప్రసంగాలకు అడ్డుకట్టవేసే విషయంలో అత్యవసరంగా కలుగజేసుకోవాలంటూ షాహీన్​ అబ్దుల్లా సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలపై చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలన్నారు. దీనిపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ కేసు విషయంలో స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి,  పలు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.