
ఈ మధ్య కోర్టుల్లో రెగ్యులర్ గా, ఎక్కువగా ఫైల్ అవుతున్న కేసులు ఏమైనా ఉన్నాయంటే అవి పరువు నష్టం కేసులే. ఒకప్పుడు ఎక్కువగా పొలిటీషియన్స్ ఈ కేసులను దాఖలు చేస్తుండేవారు. ఇప్పుడు సాధారణ ప్రజలు, ఉద్యోగులు కూడా డిఫమేషన్ కేసులతో కోర్టుకు వెళ్తుండటం చూస్తూనే ఉన్నాం. పరువు కోసం అవసరమైతే సుప్రీం కోర్టు వరకు వెళ్లేందుకు కూడా వెనకాడటం లేదు జనాలు. ఈ చట్టంపై లేటెస్ట్ గా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
పరువు నష్టం అనేది నేరం కాదని తేల్చాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు సోమవారం (సెప్టెంబర్ 22) పేర్కొంది. 2016లో పరువు నష్టం అనేది హక్కుగా అభివర్ణించిన కోర్టు.. లేటెస్ట్ గా పరువు నష్టాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని చెప్పే సమయం వచ్చిందని చెప్పడం గమనార్హం. 2016 తీర్పులో పరువు నష్టం చట్టాలకు రాజ్యాంగ హక్కులను సమర్థించింది కోర్టు. పరువు, ప్రతిష్టలు అనేవి ఆర్టికల్ 19 ప్రకారం.. ప్రాథమిక హక్కుల కిందికి వస్తాయని ఆ తీర్పులో స్పష్టం చేసింది.
ఆన్ లైన్ పబ్లికేషన్.. ది వైర్.. పై జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) ప్రొఫెసర్ దాఖలు చేసిన పిటీషన్ పై వాదనల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. 2016లో ఈ వెబ్ సైట్ రాసిన ఆర్టికల్.. యూనివర్సిటీ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని దావా వేశారు ప్రొఫెసర్. జేఎన్ యూ సెక్స్, టెర్రరిజానికి అడ్డాగా మారిందని ఆర్టికల్ పబ్లిష్ అవ్వడంతో.. ది వైర్ తో పాటు రిపోర్టర్ పై కూడా పిటీషన్ వేశారు ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్. దీనిని ఢిల్లీ హైకోర్టు సమర్ధించడంతో సుప్రీం కోర్టుకు వెళ్లారు.
వాదనల సందర్భంగా.. ఈ కేసును డీక్రిమినలైజ్ చేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. సంస్కరణలు అవసరమని వైర్ తరఫున అడ్వొకేట్ కపిల్ సిబల్ పేర్కొన్నారు.