రేణుకాస్వామి మర్డర్ కేసు: కన్నడ నటుడు దర్శన్ బెయిల్ రద్దు చేసిన సుప్రీం కోర్టు..!

రేణుకాస్వామి మర్డర్ కేసు: కన్నడ నటుడు దర్శన్ బెయిల్ రద్దు చేసిన సుప్రీం కోర్టు..!

Renukaswamy Murder Case: కర్ణాటక ప్రభుత్వం వాదనలతో ఏకీభవించిన తర్వాత గురువారం(ఆగస్టు 14)న సుప్రీం కోర్టు కన్నడ నటుడు దర్శన్ బెయిల్ రద్దు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. దీంతో గతంలో డిసెంబర్ 2024లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ గౌరవ సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. దీంతో పోలీసులు వెంటనే నటుడు దర్శను అదుపులోకి తీసుకోనున్నారని వెల్లడైంది. దర్శన్ తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. 

రేణుకాస్వామి (33) చిత్రదుర్గలోని ఫార్మసీ ఉద్యోగి. పైగా నటుడు దర్శన్ అభిమాని. అయితే ఇతడిని చిత్తూరు నుండి బెంగళూరుకు తీసుకొచ్చి హింసించి చంపినట్లు దర్యాప్తులో గుర్తించారు పోలీసులు. రేణుకాస్వామి శరీరం సుమనహల్లిలోని డ్రెయిన్ దొరికింది. అయితే ఈ హత్యను ఒక డబ్బు లావాదేవీల గొడవగా మార్చేందుకు హీరో దర్శన్ ఏకంగా రూ.70 లక్షలు కొందరికి ఇచ్చినట్లు దర్యాప్తులో తేల్చారు పోలీసులు. దీనికి సంబంధించి నటుడు, ఆమె భార్య ఇళ్లలో డబ్బును కూడా గుర్తించారు. 

Also Read : 11 డాక్యుమెంట్లు అనుమతించడం ఓటర్ ఫ్రెండ్లీనే కదా..? 

అసలు హత్య నటుడి భార్య పవిత్రా గౌడపై రేణుకాస్వామి పంపిన అసభ్య సందేశాల కారణంగా జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్, శరీర నమూనాలు, కాల్ రికార్డులు వంటి కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. ప్రముఖ నటుడు దర్శన్ తోగుడీపా, పవిత్రా గౌడ సహా మొత్తం 17 మందిని ఈ కేసులో కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాజాగా సుప్రీంకోర్టు నటుడి బెయిల్ రద్దు చేయటంతో వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది.