తిరుమలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని  ద‌ర్శించుకున్న‌ారు భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌. జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం ఉదయం  తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్ ఎన్‌.వి.రమణకు టిటిడి చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణా కర్  రెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్. జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదంతో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదనపు ఈవో  ఎవి. ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, డెప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ లోకనాథం, విజివో శ్రీ బాలిరెడ్డి పాల్గొన్నారు.