నిజమైన స్ఫూర్తితో అమలు చేయండి..

నిజమైన స్ఫూర్తితో అమలు చేయండి..
  • క్యాష్‌‌‌‌లెస్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ పథకంపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
     

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితుల కోసం రూపొందించిన క్యాష్‌‌‌‌లెస్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ స్కీంను సమర్థంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశించింది. గాయపడిన వ్యక్తికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు క్యాష్‌‌‌‌లెస్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్ అందించాల్సిన ఈ పథకాన్ని నిజమైన స్ఫూర్తితో, నిబద్ధతతో అమలు చేయాలని సూచించింది. సీమ్ పై ప్రకటనలు చేసి వదిలేయకుండా పనితనం చూపించాలంది.

క్యాష్‌‌‌‌లెస్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ పొందినవారి వివరాలు, ఆస్పత్రుల జాబితా, రాష్ట్రాల సహకారం, కల్పించిన మౌలిక సదుపాయాలు, అభ్యంతరాలు, సేవల ఆలస్యం వంటి సమగ్ర వివరాలతో అఫిడవిట్‌‌‌‌ను ఈ ఏడాది ఆగస్టు నెలాఖరులోగా సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రమాద బాధితులకు అత్యవసర స్థితిలో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందించడమే లక్ష్యంగా ఉన్న ఈ స్కీం అమలులో కేంద్రం మరింత జవాబుదారీతనంతో వ్యవహరించాలని సూచించింది.