హడావిడి లేదు: వైఎస్ వివేక విచారణ గడువు పెంపు

హడావిడి లేదు: వైఎస్ వివేక విచారణ గడువు పెంపు

మాజీ మంత్రి, ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను 2023, జూన్ 30వ తేదీ వరకు గడువు పెంచుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిగిన తర్వాత.. ఏప్రిల్ 24వ తేదీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు. కడవ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విచారణపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సైతం రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. 

ఎంపీ అవినాష్ రెడ్డి నుంచి వాంగ్మూలాన్ని లిఖితపూర్వకంగానే తీసుకోవాలని.. రాతపూర్వకంగా తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలను రద్దు చేసింది సుప్రీంకోర్టు. అయితే ముందస్తు బెయిల్ అంశాన్ని మాత్రం హైకోర్టులోనే తేల్చుకోవాలని.. సుప్రీంకోర్టు వరకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది న్యాయస్థానం.  ముందస్తు బెయిల్ పై హైకోర్టులో తేల్చేవరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న అవినాష్ రెడ్డి తరపు లాయర్ అభ్యర్థనను తోసిపుచ్చింది కోర్టు. సీబీఐ విచారణ సక్రమంగా జరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కోర్టు. సీబీఐ అరెస్ట్ చేయాలని అనుకుంటే ఎప్పుడో అరెస్ట్ చేసేదని.. మీరు ఎందుకు అలా భావిస్తున్నారని అవినాష్ రెడ్డి తరపు లాయర్ ను ప్రశ్నించింది సుప్రీంకోర్టు.