మంత్రి అయ్యుండి ఇవేం వ్యాఖ్యలు - ఉదయనిధి స్టాలిన్ పై సుప్రీం కోర్ట్ ఫైర్..!

మంత్రి అయ్యుండి ఇవేం వ్యాఖ్యలు - ఉదయనిధి స్టాలిన్ పై సుప్రీం కోర్ట్ ఫైర్..!

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సుప్రీమ్ కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో సనాతన ధర్మం చికెన్ గున్యా, డెంగ్యూ లాంటిదని దానిని నిర్ములించాలని స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై నమోదైన పిటీషన్ మీద విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. స్టాలిన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫైఆర్ ల నుండు రక్షణ కోరుతూ అతను దాఖలు చేసిన పిటిషన్ మీద ధర్మాసనం విన్న వాదనల నేపథ్యంలో సుప్రీమ్ కోర్ట్ వ్యాఖ్యలు చేసింది.

ఒక రాష్ట్రానికి మంత్రి అయ్యుండి ఇవేం వ్యాఖ్యలని స్టాలిన్ పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అతను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడని, అతను చేసే వ్యాఖ్యలు ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది తెలీదా అంటూ ప్రశ్నించింది. భావ ప్రకటన స్వేఛ్ఛ, వాక్ స్వాతంత్య్రం, మత స్వేఛ్ఛ కింద ఉన్న హక్కులను ఉదయనిధి దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీమ్ కోర్ట్.

ఉదయనిధి చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ మాత్రమే కాకుండా మిత్ర పక్షం కాంగ్రెస్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు అతని వ్యక్తిగతం అని, వాటితో కూటమికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఇంత జరుగుతున్నప్పటికీ స్టాలిన్ మాత్రం తన స్టాండ్ మీదనే ఉన్నాడు. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ద్రౌపది ముర్మును ఎందుకు ఆహ్వానించలేదని, ఆమె గిరిజన మహిళా, వితంతు మహిళా కావడం వల్లే మోడీ ఆమెను ఆహ్వానించలేదని అన్నారు, ఇలాంటి వివక్షను ప్రోత్సహించే సనాతన ధర్మాన్ని ఎందుకు గౌరవించాలని ప్రశ్నించాడు.