
న్యూఢిల్లీ:సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మరో ఇద్దరు నియమితులయ్యారు. సుప్రీంకోర్డు న్యాయమూర్తులుగా ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ మహదేవ్లను నియమిం చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దీంతో సుప్రీంకోర్టులో ప్రస్తుతం 34మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఇటీవల ఇద్దరున్యాయమూర్తులు పదవీ విరణ చేయడంతో వారిస్థానంలో జస్టిజ్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ మహదేవ్ లను సుప్రీంకోర్టు కొలీజియం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫారసు చేసింది. మంగళవారం (జూలై 16) వీరి నియమాకాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారి చేసింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగి నియమితులైన ఇద్దరిలో ఈశాన్యం రాష్ట్రం అయిన మణిపూర్ నుంచి ఒకరిని, దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు నుంచి మరొకరిని నియమించారు. మణిపూర్ నుంచి జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ తొలిసారి సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మరో జడ్జి జస్టిస్ మహదేవన్ తమిళనాడు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.