యాక్టివిస్ట్ షోమాసేన్కు సుప్రీంకోర్టు బెయిల్

యాక్టివిస్ట్ షోమాసేన్కు సుప్రీంకోర్టు బెయిల్

యాక్టివిస్ట్, నాగ్పూర్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ షోమా సేన్కు శుక్రవారం (ఏప్రిల్ 5) సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎల్గర్ పరిషత్ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు కొన్ని షరతులతో కూడా బెయిల్ ఇచ్చింది.కోర్టు అనుమతి లేకుండా మహారాష్ట్ర విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. 

మావోయిస్టులతో సంబంధాలున్నాయని యాక్టివిస్ షోమా సేన్ ను  2018లో ఎన్ఐఏ అరెస్ట్ చేశారు. నిషేధిత మావోయిస్టులతో సంబంధాలున్నాయని NIA ఆరోపిస్తూ.. షోమా సేన్ పై ఉపా చట్టంకింద కేసు నమోదు చేసింది ఎన్ఐఏ. ఐదున్నరేళ్లుగా ఆమె జైల్లో ఉన్నారు. 

జస్టిస్ అనిరుధా బోస్, జస్టిస్ జార్జ్ అగస్టిన్ మాసిస్ లతో కూడిన ధర్మాసనం.. షోమా సేన్ కండిషనల్ బెయిల్ ను మంజూరు చేసింది. ఆమె పాస్ పోర్టును కోర్టు హ్యాండ్ ఓవర్ చేయాలని.. కోర్టు అనుమతి లేకుండా మహారాష్ట్ర విడిచి వెళ్లరాదని ఆదేశించింది.  ఇన్వెస్టిగేషన్ అధికారులతో జతచేసిన ఒక ఫోన్ నంబర్ మాత్రమే షోమా సేన్ వినియోగించాలని తీర్పునిచ్చింది. 

ఏంటీ ఎల్గర్ పరిషత్ కేస్..? 

2018లో తుషార్ దాముగడే అనే వ్యక్తి  ఫిర్యాదు మేరకు పుణెలోని విశ్రాంబాగ్  పోలీస్ స్టేషన్ లో ఎల్గర్ పరిషత్ కేసును నమోదు చేయబడింది. డిసెంబర్ 31, 2017న పుణేలో శనివార్ వాడాలో ఎల్గార్ పరిషత్ అనే కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు వక్తలు, గాయకులు, కళాకారులు పాల్గొన్నారు.

తుషార్ ఫిర్యాదు ప్రకారం.. ఈ కార్యక్రంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు, మతపరమైన విద్వేషాలు కలిగించే వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు అయింది. దీంతోపాటు మావోయిస్టు లకు చెందిన సాహిత్యం కూడా ఇందులో విక్రయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫలితంగా 2018 జనవరి 1న పుణెలోని బీమా కోరేగావ్ లో హింసచెలరేగిందని.. ఇందులో ఒక వ్యక్తి మరణించగా.. అనేక మంది గాయపడ్డారని కంప్లైంట్ లో పేర్కొన్నారు.