ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల విచారణకు స్పెషల్‌‌ బెంచ్

ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల విచారణకు స్పెషల్‌‌ బెంచ్
  • ఏర్పాటు చేయాలంటూ హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆర్డర్​
  • మరణశిక్ష లేదా జీవిత ఖైదు, ఐదేండ్ల పైన శిక్ష పడే కేసులకు ప్రాధాన్యం ఇవ్వండి
  • అరుదైన సందర్భాల్లో తప్ప విచారణను వాయిదా వేయొద్దు

న్యూఢిల్లీ : ప్రజాప్రతినిధులపై నమోదైన 5 వేలకు పైగా క్రిమినల్ కేసులను వేగంగా విచారించే విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా కేసులను త్వరగా పరిష్కరించేందుకు స్పెషల్ బెంచ్‌‌ను ఏర్పాటు చేయాలని హైకోర్టులను ఆదేశించింది. అరుదైన సందర్భాలు ఎదురైనప్పుడు తప్ప మిగతా ఏ సందర్భంలోనూ విచారణను ప్రత్యేక కోర్టులు వాయిదా వేయకూడదని స్పష్టం చేసింది.

ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్‌‌ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ అశ్వినీ ఉపాధ్యాయ్‌‌ దాఖలు చేసిన పిటిషన్‌‌ను గురువారం విచారించిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టులు, జిల్లా కోర్టులు, ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను విచారించేందుకు ఏర్పాటయ్యే స్పెషల్ కోర్టులకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

యూనిఫామ్‌‌ గైడ్‌‌లైన్స్‌‌ను జారీ చేయలేం

ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌‌లో ఉన్న క్రిమినల్ కేసుల విచారణను త్వరగా పూర్తి చేసేలా పర్యవేక్షించేందుకు హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌లు సుమోటో కేసులు నమోదు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. పలు స్థానిక అంశాల దృష్ట్యా.. ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగంగా పూర్తిచేసేందుకు దేశవ్యాప్తంగా స్టాండర్డ్, యూనిఫామ్‌‌ గైడ్‌‌లైన్స్‌‌ను జారీ చేయడం క్లిష్టమైన ప్రక్రియని అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 227 ప్రకారం.. సబార్డినేట్ న్యాయవ్యవస్థపై పర్యవేక్షణ అధికారం హైకోర్టులకే ఉందని చెప్పింది.

ట్రయల్ కోర్టులపై పర్యవేక్షణ అధికారం ఉన్న నేపథ్యంలో ఆయా కేసుల్లో వేగవంతమైన విచారణను నిర్ధారించే విషయాన్ని కూడా హైకోర్టులకు వదిలిపెట్టింది. ‘‘చీఫ్ జస్టిస్ (హైకోర్టు) ఆధ్వర్యంలోని ప్రత్యేక బెంచ్ లేదా ప్రత్యేక బెంచ్‌‌కు సీజే నియమించిన జడ్జిలు.. సుమోటో కేసును విచారించవచ్చు. అవసరమైన విధంగా క్రమం తప్పకుండా కేసులను లిస్ట్ చేయవచ్చు” అని సూచించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించే కేసులు, ఐదేండ్లు.. అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించదగిన కేసులకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పింది.5,175 కేసులు పెండింగ్2022 నవంబర్ 14 నాటికి దేశవ్యాప్తంగా 5,175 కేసులు ప్రజాప్రతినిధులపై పెండింగ్‌‌లో ఉన్నాయి. 2,116 కేసులు ఐదేండ్లకు పైగా పెండింగ్​లో ఉన్నా యి. ఈ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.