మెడికల్ కోర్సుల్లో కొత్త రిజర్వేషన్ విధానంపై సుప్రీంకోర్టు నోటీసు

మెడికల్ కోర్సుల్లో కొత్త రిజర్వేషన్ విధానంపై సుప్రీంకోర్టు నోటీసు

న్యూఢిల్లీ: మెడికల్ కోర్సుల్లో కొత్త రిజర్వేషన్ విధానం అంశం కోర్టుమెట్లెక్కింది. ఆలిండియా కోటాలో  డెంటల్ మరియు మెడికల్ అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో  27 శాతం బీసీలకు, 10 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ఆదేశాలను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో ఇవాళ పిటిషన్‌ దాఖలైంది. 
పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ 50శాతం మించి కోటా ఉండటానికి వీల్లేదన్న అంశాన్ని కోర్టు పరీశీలించాలని కోరారు. దాఖలైన పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది.