ఇంజనీరింగ్ కాలేజీలకు సుప్రీం షాక్

ఇంజనీరింగ్ కాలేజీలకు సుప్రీం షాక్

ఢిల్లీ: ఇంజనీరింగ్ కాలేజీలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీ ఫీజుల నియంత్రణ అధికారం నిపుణుల కమిటీ చేతికే ఉంటుందని తీర్పునిచ్చింది.  ఫీజుల నియంత్రణ విధానంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని సమర్ధించింది సుప్రీం. వాసవి, శ్రీనిధి  ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు కేసులో సుప్రీంకోర్టు తాజాగా ఈ తీర్పునిచ్చింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ వాసవి కళాశాల పేరెంట్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..  ప్రవేశాల నియంత్రణ కమిటీ నిర్ణయం ప్రకారమే ఫిజులు ఉండాలని తేల్చి చెప్పింది. హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించరాదని అభిప్రాయపడింది.