రామోజీరావు, ఏపీ సర్కారుకు సుప్రీం నోటీసులు

రామోజీరావు, ఏపీ సర్కారుకు సుప్రీం నోటీసులు
  • మార్గదర్శి చిట్ ఫండ్ కేసు

న్యూఢిల్లీ, వెలుగు : మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో రామోజీరావుకు, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో జవాబివ్వాలని ఆదేశించింది. డిపాజిట్ హిందు అవిభాజ్య కుటుంబం పేరుతో ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్​ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. 2018 డిసెంబర్ 31న ఉమ్మడి ఏపీ హైకోర్టు ఈ పిటిషన్​ను కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇందులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్​ అయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసింది. మార్గదర్శి వ్యవహారంలో రామోజీరావు సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుర్యకాంత్ బెంచ్ సోమవారం విచారణ జరిపింది.