అయోధ్యపై సుప్రీం : ముగ్గురు మధ్యవర్తులతో ప్యానెల్ ఏర్పాటు

అయోధ్యపై సుప్రీం : ముగ్గురు మధ్యవర్తులతో ప్యానెల్ ఏర్పాటు

అయోధ్యలోని రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదానికి శాశ్వత పరిష్కారం దిశగా సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. మధ్యవర్తిత్వానికి రాజ్యాంగ ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముగ్గురు మధ్యవర్తులతో ప్యానెల్ ఏర్పాటు చేసింది. జస్టిస్ కులిఫుల్లా చెర్మైన్ గా ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్, శ్రీరామ్ పంచూలను అపాయింట్ చేసింది. ముగ్గురు మధ్యవర్తుల ప్యానెల్ ఫైజాబాద్ లోనే సంప్రదింపులు చేయనుంది. మధ్యవర్తిత్వ ప్రక్రియ అంతా గోప్యంగా  జరగనుంది. కేసు విచారణలో మీడియా జోక్యాన్ని రాజ్యాంగ ధర్మాసనం నిషేదించింది. నాలుగు వారల్లోగా ప్రారంభించి…8 వారల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది.