
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ మెడికల్ సీట్లలో రాష్ట్ర ఉద్యోగుల పిల్లలతో పాటు కేంద్ర సర్వీసుల్లోని పిల్లలకు కూడా స్థానిక ప్రయోజనాన్ని కల్పించాలని ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర సర్వీసుల్లోని పిల్లలకు ఈ ప్రయోజనాలు కల్పించే ఆశంపై స్పష్టత ఇవ్వాలని మంగళవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి బెంచ్ ముందు మెన్షన్ చేశారు.
ప్రస్తుతం కౌన్సెలింగ్ ప్రారంభమైనందున శుక్రవారం జాబితాలో ఈ పిటిషన్ పై విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. అయితే, వైద్య విద్య ప్రవేశాల్లో తెలంగాణలో వరుసగా 9, 10, 11,12 తరగతులు చదివి ఉండాల్సిందేనని ఈ నెల 1వ తేదీన స్థానికత విషయంలో సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇందులో ఐఏఎస్, ఐపీఎస్ లతో పాటు కేంద్ర సర్వీస్ లోని ఉద్యోగులను మినహాయింపు ఇస్తూ పలు మార్గదర్శకాలు ఇచ్చింది.
అయితే, ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ తీర్పు ప్రయోజనాన్ని నిరాకరిస్తున్నట్టు ధర్మాసనం దృష్టి తీసుకెళ్లారు. ‘మేం స్పష్టత కోసం ఈ దరఖాస్తు దాఖలు చేశాం. రాష్ట్ర ఉద్యోగులుగా ఉన్న తల్లిదండ్రుల విద్యార్థులను కూడా స్థానిక అభ్యర్థులుగా పరిగణించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఎవరి తల్లిదండ్రులు రాష్ట్ర సర్వీస్లులో ఉన్నారనే అంశాన్ని పరిశీలిస్తోంది.
కేంద్ర సర్వీస్లుల్లో ఉన్న వారిని కాదు’ అని కోర్టుకు నివేందించారు. ఇందుకు సీజేఐ బదులిస్తూ.. తమ ఆదేశాలు పాటించకపోతే కోర్టు ధిక్కార పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఇందుకు పిటిషనర్ బదులిపస్తూ.. ప్రస్తుతం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైనందున ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని కోరారు.