న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీ కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మంగళవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.
అయితే, కేసు విచారణను ఒక్కరోజుకు(బుధవారం) వాయిదా వేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. ఈ అభ్యర్థనపై ప్రతివాదులు అభ్యంతరం తెలపకపోవడంతో ధర్మాసనం కేసు విచారణను నేటికి వాయిదా వేసింది.

