
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గ్రూప్- 1 నియామకాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే నియామకాలు ఉండాలని స్పష్టం చేసింది.
గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు ఇచ్చిన డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులపై పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వడంపై స్టే ఇవ్వాలని కోరారు. అక్టోబర్ 7న జస్టిస్ సూర్యకాంత్, జోయమాల్య బాగ్జిల ధర్మాసనం పిటిషన్ ను విచారించింది. ఇరు వర్గాల వాదనల అనంతరం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది కోర్టు.
ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లన్నీ అక్టోబర్ 15న హైకోర్టులో విచారణకు రానుండడంతో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పాటించాలని సూచించింది. వీలైనంత త్వరగా పిటిషన్లు విచారించి ఆదేశాలివ్వాలని చెప్పింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణను ముగించింది.
గ్రూప్ 1 కు ఎంపికైన మొత్తం 562 మందికి సెప్టెంబర్ 27న సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించిన సంగతి తెలిసిందే.