బాలిక రాసిన లేఖను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

బాలిక రాసిన లేఖను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఓ బాలిక రాసిన లేఖపై సుప్రీంకోర్టు అసాధారణ రీతిలో స్పందించింది. సదరు లేఖనే ప్రజా ప్రయోజన వాజ్యంగా స్వీకరించి విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని జస్టిస్ వినీత్ సరణ్ వెల్లడించారు. శనివారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సత్కార సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో జస్టిస్ వినీత్ సరణ్ మాట్లాడుతూ.. ‘‘మా స్కూల్స్ తెరిచారు.. మరి మీ కోర్టులు ఎందుకు తెరవడం లేదు..’’ అంటూ ఓ బాలిక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ఉద్దేశించి లేఖ రాసింది. 

ఈ లేఖపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వెంటనే స్పందించి ప్రజా ప్రయోజన వాజ్యంగా పరిగణిస్తూ విచారణకు ఆదేశించారు. త్వరలోనే ఈ కేసు విచారణకు వస్తుందని జస్టిస్ వినీత్ సరణ్ వెల్లడించారు. గత ఏడాది  కరోనా ప్రభావం మొదలయ్యాక దేశ వ్యాప్తంగా  చాలా వరకు కోర్టులన్నీ వర్చువల్ గానే నడుస్తున్నాయి గాని ప్రత్యక్షంగా కేసుల విచారణ జరగడం లేదు. ఈ నేపధ్యంలో ఓ బాలిక సీజేకు మా స్కూల్స్ తెరిచారు.. మీ కోర్టులెందుకు తెరవడం లేదని ప్రశ్నిస్తూ రాసిన లేఖపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ విచారణకు ఆదేశించారు.