హేమాంత్ సొరేన్‌కు సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరణ

హేమాంత్ సొరేన్‌కు సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరణ

జార్ఖండ్ మాజీ సీఎం హేమాంత్ సొరేన్ కు సుప్రీం కోర్టులో నిరాశే ఎదురైంది. జార్ఖండ్ లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఆయన మధ్యంతర బెయిల్ కు అప్లై చేసుకున్నారు. సుప్రీం కోర్టు బుధవారం (మే 22)న ఈ బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ  హేమంత్ సొరేన్ ను జనవరి 31న అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. సుప్రీం కోర్టులో సొరేన్ రెండు పిటిషన్లు వేశాడు.

ఒకటి ఆయన అరెస్ట్ ను వ్యతిరేఖిస్తూ, మరొకటి ఎలక్షన్  ప్రచారంలో పాల్గొనడానికి బెయిల్  ఇవ్వాలని కోర్టును కోరారు. మధ్యంతర బెయిల్‌ కోసం వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు హేమంత్ సోరెన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. 

హేమంత్ సోరెన్  గవర్నమెంట్ టైంలో భూమి మార్పిడి కోసం భారీగా అవినీతి లావాదేవీలు జ‌రిగాయి. ఆ కేసులో ఈడీ విచార‌ణ చేప‌డుతున్నది. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌న‌కు బెయిల్ మంజూరీ చేయాల‌ని సోరెన్ కోరారు. దీని కోసం ఆయ‌న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేసును ఉదాహ‌ర‌ణ‌గా చూపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన కేజ్రీవాల్‌.. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బెయిల్ తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న ఆప్ కు మద్దతు కూడా ఇస్తున్నారు.