Liquor Scam : సుప్రీంకోర్టులో కవితకు ఎదురుదెబ్బ  : 24వ తేదీనే పిటీషన్ విచారిస్తాం

Liquor Scam : సుప్రీంకోర్టులో కవితకు ఎదురుదెబ్బ  : 24వ తేదీనే పిటీషన్ విచారిస్తాం

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ విచారణ.. 20వ తేదీన హాజరుకావాలన్న నోటీసులను సవాల్ చేస్తూ.. పెండింగ్ లో ఉన్న పిటీషన్ ను అత్యవసరం విచారించాలని విన్నవించుకున్నారు. దీనిపై మార్చి 17వ తేదీ శుక్రవారం అత్యున్నత న్యాయస్థానంలోని ధర్మాసనం విచారణ చేసింది. మీ పిటీషన్ పరిశీలించాం.. ముందుగా నిర్ణయించినట్లు.. మార్చి 24వ తేదీనే విచారిస్తాం అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.

20వ తేదీన ఈడీ విచారణకు హాజరవుతున్న క్రమంలో.. 24వ తేదీన చేపట్టాల్సిన విచారణను.. ముందుగానే చేపట్టాలని సుప్రీంకోర్టును కోరారు కవిత. మహిళల హక్కులకు విరుద్ధంగా.. నిబంధనలకు భిన్నంగా ఈడీ వ్యవహరిస్తుందని.. బలవంతంగా వాంగ్మూలం తీసుకుంటారని తన పిటీషన్ లో స్పష్టం చేశారు కవిత.

సుప్రీంకోర్టులో పిటీషన్ పెండింగ్ లో ఉందన్న కారణంతో.. ఈడీ విచారణకు హాజరుకాలేదు కవిత. ఇప్పుడు కోర్టు అందుకు భిన్నంగా తీర్పు ఇవ్వటంతో.. 20వ తేదీన ఈడీ ఆఫీసుకు వెళ్లి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు క్రమంలో.. మరో మార్గం లేకుండా పోయింది కవితకు.