
న్యూఢిల్లీ, వెలుగు: పోలీస్ శాఖలో డ్రైవర్ల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 2022లో పోలీస్, ఫైర్ శాఖకు సంబంధించి డ్రైవర్ల నియామకానికి ప్రభుత్వం నోటీఫికేషన్లు జారీ చేసింది. ఈ ఫోస్టులకు అప్లయ్ చేసే అభ్యర్థుల డ్రైవింగ్ లైసెన్స్‌లో నోటిఫికేషన్‌కు రెండేండ్ల ముందు వరకు ఎలాంటి గ్యాప్‌లు (రిన్యూవల్, ఇతర సమస్యలతో) ఉండకూడదని ప్రస్తావిస్తూ పలువురిని రిజెక్ట్ చేసింది.
ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ పలువురు హైకోర్టును ఆశ్రయించగా.. వారికి సానుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గతేడాది మార్చి 6న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రతివాదులుగా పింజర్ల విజయ్ కుమార్‌తో పాటు మరో 78 మందిని చేర్చింది.