
ఏపీ పాలిటిక్స్ లో తీవ్ర దుమారం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A 39గా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై శుక్రవారం ( అక్టోబర్ 10 ) విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో ఏపీ సర్కార్ కు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
లిక్కర్ స్కాం కేసులో మోహిత్ రెడ్డిని A39 గా ఉండగా.. A 38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం విజయవాడ జైల్లో జ్యూడిష రిమాండ్ లో ఉన్నారు.2025 జూన్ 18న చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. లిక్కర్ స్కాం ద్వారా వచ్చిన డబ్బులు మోహిత్ రెడ్డి ప్రభుత్వ వాహనాల ద్వారా తరలించారని సిట్ ఆరోపిస్తోంది.
ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కాంలో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు మోహిత్ రెడ్డి. హైకోర్టులో మోహిత్ రెడ్డికి దక్కకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మోహిత్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు మోహిత్ రెడ్డి వాదనలతో ఏకీభవించి ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.