ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మరణిస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదు.. తేల్చేసిన సుప్రీం కోర్టు

ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మరణిస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదు.. తేల్చేసిన సుప్రీం కోర్టు

రోడ్డు ప్రమాదాలు సర్వ సాధారణంగా మారిపోయాయి. అయితే కొందరు తాము స్పీడుగా చేసే ర్యాష్ డ్రైవింగ్ అలవాట్ల వల్లే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు సహజంగా చూస్తూనే ఉంటాం. దీనికి సంబంధించిన ఒక కేసులో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గురించి అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే. 

ప్రయాణ సమయంలో తమ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదానికి గురై చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు మోటార్ వాహనాల చట్టం కింద ఇన్సూరెన్స్ పరిహారాన్ని చెల్లించక్కర్లేదని సుప్రీం ధర్మాసనం తాజాగా ఒక తీర్పు వెలువరించింది. జస్టిస్ పిఎస్ నరసింహ, ఆర్ మహదేవన్ ధర్మాసనం రూ.80 లక్షల పరిహారానికి సంబంధించిన కేసులో ఈ తీర్పు వెలువరించారు. కారు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు పరిహారంపై కర్ణాటక హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించా వాదనలు విన్న కోర్టు ఈ మేరకు తీర్పును ప్రకటించింది. 

ALSO READ | రూ.120కి రూ.720 పెట్రోల్ : ఏంటి అని అడిగితే కొట్టారు.. కేసు నమోదు..

గత నవంబరులో కారు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా అతని చట్టపరమైన వారసులు దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోమని సుప్రీం ధర్మాసనం బెంచ్ వెల్లడించటంతో ఆ కుటుంబానికి నిరాశ మిగిలింది. 

ప్రయాణ సమయంలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నిర్లక్ష్య వైఖరి, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగి వ్యక్తులు మరణించినా లేక గాయపడినా దానిపై కుటుంబ సభ్యులు క్లెయిమ్ కోసం కోరటం కుదురదని కోర్టు తేల్చేసింది. ఇలాంటి సందర్భాల్లో చట్టాల ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తి తన సొంత తప్పులకు పరిహారం పొందినట్లు అవుతుందని హైకోర్టు పేర్కొంది.