ఎంపీ నవనీత్ కౌర్ కు సుప్రీంకోర్టులో ఊరట

ఎంపీ నవనీత్ కౌర్ కు సుప్రీంకోర్టులో ఊరట

మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కు సుప్రీంకోర్టులో రిలీఫ్ లభించింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్ ను క్యాన్సిల్ చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. SC రిజర్వ్ నియోజకవర్గమైన అమరావతి నుంచి ఫేక్ SC సర్టిఫికెట్ తో ఆమె ఎన్నికల్లో పోటీ చేశారని శివసేన నేత ఆనంద్ రావ్ అడ్సుల్ బాంబే హైకోర్టులో కేసు వేశారు. దీనిని విచారించిన హైకోర్టు నాగ్ పూర్ బెంచ్... ఈ నెల 8న క్యాస్ట్ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేసి... నవనీత్ కౌర్ కు 2 లక్షల రూపాయల జరిమానా విధించింది. బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు నవీనీత్ కౌర్. ఇవాళ పిటిషన్ ను విచారించిన సుప్రీం... హైకోర్టు తీర్పును నిలుపుదల చేసింది.