EWS రిజర్వేషన్లను సుప్రీం సమర్ధించడం విచారకరం: ఆర్.కృష్ణయ్య

EWS రిజర్వేషన్లను సుప్రీం సమర్ధించడం విచారకరం: ఆర్.కృష్ణయ్య

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు సమర్ధించడం విచారకరమని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పుపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని  గతంలో 9 మంది జడ్జీల ధర్మాసనం తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. రిజర్వేషన్లను సమర్థిస్తూ ఇచ్చిన తీర్పుపై 11 మంది సభ్యుల ధర్మాసనం దీనిపై విచారణ జరపాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కల్పించడం కేంద్ర ప్రభుత్వ అసంబద్ద వైఖరని మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్దికోసమే ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషనన్లు కల్పిస్తున్నారని  కృష్ణయ్య ఆరోపించారు. 

విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో10 శాతం కోటా నిర్ణయాన్ని సమర్ధిస్తూ సుప్రీం ఇవాళ తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి 103వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్దమే అని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం రిజర్వేషన్లపై 3:2తో తీర్పు వెలువరించింది.